రూ. 94 రూపాయలకే Jio Wi-Fi రౌటర్

Updated on 21-Feb-2021
HIGHLIGHTS

Jio WiFi ఆఫర్ అందుబాటులో ఉన్న వాటిలో బెస్ట్ అని చెప్పొచ్చు.

జియో సిమ్ కార్డుతో పనిచేసే ఈ Wi Fi రౌటర్

మూడు కొత్త JioFi ప్లాన్‌ లలో దేనినైనా ఎంచుకోవచ్చు.

Jio WiFi ఆఫర్ అందుబాటులో ఉన్న వాటిలో బెస్ట్ అని చెప్పొచ్చు. జియో ప్రతి ఒక్కరికి WiFi అందించే విధంగా JioFi ని ప్రతినెలా అతితక్కువ EMI  పద్దతిలో కొనుగోలు చేసే అవకాశం అందించింది. ఈ జియో సిమ్ కార్డుతో పనిచేసే ఈ Wi Fi రౌటర్ రూ.1,999 ధరతో వస్తుంది. అయితే, ఈ JioFi ని  నెలకు కేవలం రూ. 94 రూపాయల తక్కువ అఫర్ తో చెల్లించడం ద్వారా మీరు కొనవచ్చు. అంతేకాదు,  ఇతర ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

రిలయన్స్ డిజిటల్ స్టోర్ నుండి JioFi 4G Hot Spot ‌ను కొనుగోలు చేసి, ఆపై జియో సిమ్ ‌ను యాక్టివేట్ చేసిన తరువాత, వినియోగదారులు డివైజ్ ని ఎనేబుల్ చేయడానికి అందుబాటులో ఉన్న మూడు కొత్త JioFi ప్లాన్‌ లలో దేనినైనా ఎంచుకోవచ్చు. యాక్టివ్ సిమ్ ‌ను JioFi 4G  పరికరంలో చేర్చిన తర్వాత ఎంచుకున్న ప్లాన్ తో పాటుగా ఉచిత డేటా కొద్ది గంటల్లో ప్రారంభమవుతుంది. ఈ ప్లాన్ యొక్క యాక్టివ్ స్టేటస్ ని MyJioApp ద్వారా తనిఖీ చేయవచ్చు.

మొదటి ప్లాన్: రూ. 199 ప్లాన్

ఇది ప్రతిరోజూ 1.5 జిబి డేటాను అందిస్తుంది. మరియు ఇది 28 రోజులు చెల్లుతుంది. మీరు అదనపు జియో ప్రైమ్ సభ్యత్వాన్ని 99 తో జోడించవచ్చు. ఇందులో ప్రతిరోజూ 1.5 జిబి ఉచిత డేటా, జియో టు జియో అన్‌లిమిటెడ్ కాల్స్,  జియో నుండి ఇతర మొబైల్స్ కోసం 28 రోజులకు 1000 నెట్ ‌వర్క్ నిమిషాలు మరియు రోజుకు 100 జాతీయ ఎస్‌ఎంఎస్ 140 రోజుల వరకూ అందిస్తుంది. అంటే, 5 నెలల వరకూ ఉచితంగా ఇస్తుందన్న మాట.  

రెండవ ప్లాన్: రూ .249 ప్లాన్

ఇది ప్రతిరోజూ 28 రోజుల పాటు 2 జిబి డేటాను అందిస్తుంది. ఇక్కడ కూడా మీరు అదనపు జియో ప్రైమ్ సభ్యత్వం 99 ను కూడా రీఛార్జ్ చేయాలి. దీనితో, మీకు రోజుకు 2GB డేటా జియో నుండి జియో అపరిమిత కాల్స్,  జియో నుండి ఇతర మొబైల్ నెట్‌వర్క్ కోసం 1000 నిమిషాలు 28 రోజుల కోసం మరియు డైలీ 100 జాతీయ SMS లను 112 రోజుల వరకూ అందిస్తుంది.

మూడవ ప్లాన్: రూ. 349 ప్లాన్

ఇది  రోజూ 3 GB డేటాని 28 రోజులు వ్యాలిడిటీతో అందిస్తుంది. ఇక్కడ మీరు అదనపు జియో ప్రైమ్ సభ్యత్వం 99 ను కూడా యాక్సెస్ చేయాలి. దీనితో, మీకు రోజుకు 3GB డేటా జియో నుండి జియో అపరిమిత కాల్స్,  జియో నుండి ఇతర మొబైల్ నెట్‌వర్క్ కోసం 1000 నిమిషాలు 28 రోజుల కోసం మరియు డైలీ 100 జాతీయ SMS లను 84 రోజుల వరకూ అందిస్తుంది.

Note: మరిన్ని Jio Best Plans కోసం ఇక్కడ నొక్కండి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :