జియోఫోన్ నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ ను భారత దేశంలో అత్యంత చవకైన ఫోన్ గా విడుదల చేయనున్నట్లు జియో ప్రకటించింది. 44 వ RIL AGM నుండి ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను ప్రకటించింది. అయితే, JioPhone Next స్మార్ట్ ఫోన్ సెప్టెంబర్ 10 నుండి భారతదేశంలో అందుబాటులోకి వస్తుందని ప్రకటించిచింది. ఈ ఫోన్ ధర ను మాత్రం ప్రకటించలేదు.
JioPhone Next కేవలం రూ.5,000 రూపాయల కంటే తక్కువ ధరలో ఉండవచ్చని మార్కెట్ వర్గాలు ఊహిస్తున్నాయి. ఎందుకంటే, ఈ ఫోన్ లో ఉండనున్నట్లు వెల్లడించిన ఫీచర్ల ప్రకారం, ప్రస్తుతం మార్కెట్లో ఇప్పటికే ఉన్న ఫోన్లతో పోల్చి చూస్తే నిజమే అనిపిస్తుంది.
జియోఫోన్ నెక్స్ట్ అనేది గూగుల్ క్లౌడ్ మరియు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఫుల్లీ ఫీచర్డ్ స్మార్ట్‌ఫోన్. ఈ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్ల గురించి మాట్లాడితే, ఇది వాయిస్ అసిస్టెంట్, ఆటోమేటిక్ రీడ్-లౌడ్ ఆఫ్-స్క్రీన్ టెక్స్ట్ వంటి చాలా ఫీచర్లు ఈ JioPhone Next లో చేర్చబడ్డాయి. దీనితో పాటు, భాషా అనువాదం(లాంగ్వేజ్ ట్రాన్స్ లేషన్) వంటి ఫీచర్లు కూడా ఇందులో అందించింది.
జియోఫోన్ నెక్స్ట్ స్మార్ట్ కెమెరాతో ప్రారంభించబడుతుంది. ఇది ఆగ్మెంటెడ్ రియాలిటీ ఫిల్టర్‌తో కూడా వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ప్రకటన సందర్భంగా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మాట్లాడుతూ భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా అత్యంత సరసమైన స్మార్ట్‌ఫోన్ గా ఇది ల్యాండ్ అవుతుందని చెప్పారు.
ఈ కొత్త సరసమైన 4 జి స్మార్ట్‌ఫోన్ సహాయంతో ఇంకా 2G నెట్వర్క్ కే పరిమితపరిమితమైన 300 మిలియన్ల వినియోగదారులను 4జి నెట్‌వర్క్‌కు తీసుకురావాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖేష్ అంబానీ తెలిపారు. నెక్స్ట్ లెవల్ చందాదారుల వృద్ధి కోసం రిలయన్స్ ఎంట్రీ లెవల్ వినియోగదారుల వైపు మొగ్గు చూపుతోందని కూడా వెల్లడించారు. ఇక్కడ ప్రపంచంలోనే అత్యంత సరసమైన స్మార్ట్ ఫోన్ అని చెబుతోందంటే ఈ ఫోన్ అంచనాలకు అందని సరసమైన ధరలో ప్రకటించవచ్చని ఊహిస్తున్నారు.