JioPhone Next అమెజాన్ నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది..!!

Updated on 23-May-2022
HIGHLIGHTS

JioPhone Next అమెజాన్ నుండి డిస్కౌంట్ ధరకే లభిస్తోంది

బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 1,500 రూపాయల తక్షణ డిస్కౌంట్

జియో ఎక్స్ చేంజ్ అఫర్ కూడా అందించింది

రిలయన్స్ జియో మరియు గూగుల్ జతగా ప్రకటించిన JioPhone Next అమెజాన్ నుండి డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. అంతేకాదు, జియో కూడా తన వెబ్సైట్ ద్వారా ఈ JioPhone Next స్మార్ట్ ఫోన్ పైన ఎక్స్ చేంజ్ అఫర్ ను జతచేయడంతో, చవక ధరకే ఈ ఫోన్ ల భిస్తోంది. మార్కెట్లో రూ.6,499 రూపాయల ధరతో ప్రకటించబడిన ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ నుండి 35% డిస్కౌంట్ తో కేవలం రూ.4,650 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది.  

అంతేకాదు, ఈ ఫోన్ పైన బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లను కూడా అందించింది. ఈ ఫోన్ ను Citi బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 1,500 రూపాయల తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే, YES బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో ఈ ఫోన్ కొనేవారికి కూడా 10% డిస్కౌంట్ లభిస్తుంది.     

ఇక జియో వెబ్సైట్ ద్వారా అందిస్తున్న అఫర్ విషయానికి వస్తే, ఈ ఫోన్ ను ఏదైనా 4G ఫోన్ తో ఎక్స్ చేంజ్ చేస్తే, JioPhone Next కేవలం రూ.4,499 రూపాయలకే లభిస్తుంది. అంతేకాదు, నెలవారీ EMI పద్దతిలో ఎంచుకుంటే ముందుగా కేవలం రూ.1,999 రూపాయలు చెల్లించి ఈ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు మరియు మిగిలిన డబ్బును 18 లేదా 24 నెలల వాయిదాల్లో ఈజీ EMI ద్వారా చెల్లించవచ్చు.

JioPhone Next: స్పెక్స్

ఇక JioPhone Next ఫీచర్ల విషయానికి వస్తే, జియోఫోన్ నెక్స్ట్ 5.45-అంగుళాల HD(720×1440) డిస్ప్లే కలిగి ఉంటుంది మరియు ఈ స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణతో వస్తుంది. ఈ ఫోన్ 1.3 GHz క్లాక్ స్పీడ్ అందించగల Qualcomm QM215 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. అలాగే, ఈ ఫోన్  LPDDR3 2GB ర్యామ్ మరియు 32GB ఇన్ బిల్ట్ స్టోరేజ్ కలిగివుంటుంది. అలాగే, మైక్రో SD ద్వారా 512GB మెమోరిని విస్తరించవచ్చు.

ఈ ఫోన్ లో వెనుక 13MP సింగల్ కెమెరా మరియు ముందు సెల్ఫీల కోసం 8MP సెల్ఫీ కెమెరాలను అందించింది. ఈ కెమెరా HDR Mode, Night Mode, Portrait వంటి మరిన్ని ఫీచర్లతో వస్తుంది. ఈ ఫోన్ లో 3000mAh బ్యాటరీని సాధారణ ఛార్జింగ్ టెక్నాలజీతో ఇచ్చింది.   

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :