JioPhone Next: ఈ సరసమైన స్మార్ట్ ఫోన్ ధర ఎంతో ఊహించగలరా?

Updated on 25-Jun-2021
HIGHLIGHTS

Reliance జియోఫోన్ నెక్స్ట్‌ ను విడుదల చేసింది

ప్టెంబర్ 10 నుండి భారతదేశంలో అందుబాటులోకి వస్తుంది

ప్రపంచంలో అత్యంత సరసమైన ఫోన్

గూగుల్ సహకారంతో రిలయన్స్ జియో భారతదేశంలో మొట్టమొదటి ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్ గా జియోఫోన్ నెక్స్ట్‌ ను విడుదల చేసింది. ఇది పూర్తిగా టచ్‌ స్క్రీన్ ఎనేబుల్ చేసిన స్మార్ట్‌ఫోన్. ఈ లేటెస్ట్ JioPhone Next స్మార్ట్ ఫోన్ సెప్టెంబర్ 10 నుండి భారతదేశంలో అందుబాటులోకి వస్తుంది. ఈ జియోఫోన్ గురించి పూర్తిగా తెలుసుకోండి …

JioPhone Next: ఫుల్లీ ఫీచర్డ్ స్మార్ట్‌ఫోన్

జియోఫోన్ నెక్స్ట్ అనేది గూగుల్ క్లౌడ్ మరియు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఫుల్లీ ఫీచర్డ్ స్మార్ట్‌ఫోన్. ఈ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్ల గురించి మాట్లాడితే, ఇది వాయిస్ అసిస్టెంట్, ఆటోమేటిక్ రీడ్-లౌడ్ ఆఫ్-స్క్రీన్ టెక్స్ట్ వంటి చాలా ఫీచర్లు ఈ JioPhone Next లో చేర్చబడ్డాయి. దీనితో పాటు, భాషా అనువాదం(లాంగ్వేజ్ ట్రాన్స్ లేషన్) వంటి ఫీచర్లు కూడా ఇందులో అందించింది.

జియోఫోన్ నెక్స్ట్ స్మార్ట్ కెమెరాతో ప్రారంభించబడుతుంది. ఇది ఆగ్మెంటెడ్ రియాలిటీ ఫిల్టర్‌తో కూడా వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్  ప్రకటన సందర్భంగా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మాట్లాడుతూ భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా అత్యంత సరసమైన స్మార్ట్‌ఫోన్‌ గా ఇది ల్యాండ్ అవుతుందని చెప్పారు.

ఈ కొత్త సరసమైన 4 జి స్మార్ట్‌ఫోన్ సహాయంతో ఇంకా 2G నెట్వర్క్ కే  పరిమితపరిమితమైన 300 మిలియన్ల వినియోగదారులను 4జి నెట్‌వర్క్‌కు తీసుకురావాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖేష్ అంబానీ తెలిపారు. నెక్స్ట్ లెవల్ చందాదారుల వృద్ధి కోసం రిలయన్స్ ఎంట్రీ లెవల్ వినియోగదారుల వైపు మొగ్గు చూపుతోందని కూడా వెల్లడించారు. ఇక్కడ ప్రపంచంలోనే అత్యంత సరసమైన స్మార్ట్ ఫోన్ అని చెబుతోందంటే ఈ ఫోన్ అంచనాలకు అందని సరసమైన ధరలో ప్రకటించవచ్చని ఊహిస్తున్నారు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :