రిలయన్స్ జియో కొత్త ప్లాన్స్ ప్రకటించి మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే, ఈ కొత్త ప్లాన్స్ తో JioFi హాట్ స్పాట్ ని ఉచితంగా ఆఫర్ చేస్తోంది. JioFi అనే పిలిచే జియో WiFi హాట్‌స్పాట్ రౌటర్ కోసం కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్ లను ఆవిష్కరించింది. అంతేకాదు, ఈ ప్లాన్స్ ఎంచుకునేవారికి ఉచిత హాట్‌స్పాట్ రౌటర్ లను కూడా ఉచితంగా ఆఫర్ చేస్తోంది. జియో కొత్తగా తీసుకొచ్చిన ఈ ప్లాన్స్ మరియు అవి అఫర్ చేసే ప్రయోజాలను గురించి తెలుసుకుందామా.
జియో JioFi కోసం మూడు కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్ లను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ లను రూ. 249, రూ.299 మరియు రూ.349 ధరతో అందించింది. అయితే, ఈ ప్లాన్స్ కేవలం డేటాని మాత్రమే ఆఫర్ల చేస్తాయి. ఈ ప్లాన్ లతో కాలింగ్ మరియు SMS వంటి ప్రయోజాలను మాత్రం పొందలేరు. ఈ ప్లాన్స్ అఫర్ చేసే ప్రయోజాలను క్రింద చూడవచ్చు.
ఈ మూడు ప్లాన్స్ కూడా నెల రోజుల వ్యాలిడిటీతో వస్తాయి.
రూ. 249 ప్లాన్ – 30GB నెలవారీ డేటాతో వస్తుంది
రూ. 299 ప్లాన్ – 40GB నెలవారీ డేటాతో వస్తుంది
రూ. 349 ప్లాన్ – 50GB నెలవారీ డేటాతో వస్తుంది
పైన పేర్కొన్న డేటా లిమిట్ ముగిసిన తరువాత, ఇంటర్నెట్ వేగం 64 Kbps కి తగ్గుతుంది.
అయితే, ఈ ప్లాన్స్ పైన కొన్ని కండిషన్స్ వర్తిస్తాయని గమనించాలి. అదేమిటంటే, ఈ ప్లాన్స్ అన్ని కూడా 18 నెలల లాక్-ఇన్ పీరియడ్‌తో వస్తాయని గుర్తుంచుకోండి. అంటే, మీరు డేటాను ఉపయోగించుకున్నా లేదా ఉపయోగించకున్నా, మీకు 18 నెలల పాటు ప్రతి నెలా అదే మొత్తం ఛార్జ్ చేయబడుతుంది. ఒకవేళ మీరు ఈ ప్లాన్స్ నిలిపివేయాలనుకున్నా Exit ఛార్జీలను చెల్లించిన తర్వాత మాత్రమే క్లోజ్ అవుతుంది. అలాగే, మీరు ఈ ప్లాన్ లను పొందేందుకు కనీసం 200 రూపాయల విలువైన మొదటి ఆర్డర్ చేయాలి.
ఇక ఉచిత రూటర్ ఆఫర్ విషయానికి వస్తే, మీరు JioFi పోస్ట్‌పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ను రద్దు చేసినప్పుడు అవి యూజ్ అండ్ రిటర్న్ ప్రాతిపదికన అందించబడే షరతు ఉంది. అంటే, మీరు ఈ ప్లాన్ లను నిలిపివేసిన వెంటనే రౌటర్ ను వెనక్కు తిరిగి ఇవ్వవలసి ఉంటుంది.