jio launches AI smart glasses Jio Frames from RIL AGM 2025
రిలయన్స్ ఈరోజు నిర్వహించిన 48వ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యాన్యువల్ జనరల్ మీటింగ్ (RIL AGM 2025) నుంచి ఈరోజు కొత్త అనౌన్స్మెంట్ అందించింది. ఈరోజు నిర్వహించిన ఈ అతిపెద్ద ఈవెంట్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పని చేసే Jio Frames లాంచ్ చేసింది. ఇది AI Smart Glasses మరియు AI సపోర్ట్ తో చాలా పనులు సులభతరం చేస్తుంది. రిలయన్స్ అందించిన ఈ కొత్త ప్రోడక్ట్ ఏమిటో చూద్దామా.
ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యాన్యువల్ జనరల్ మీటింగ్ (RIL AGM 2025) నిర్వహించింది. ఈ కార్యక్రమం నుంచి ప్రతి సంవత్సరం కొత్త
ప్రోడక్ట్స్ అందించడం ఆనవాయితీ. ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమం నుంచి ఈ కొత్త ప్రోడక్ట్ ను అందించింది. అదే, జియో ఫ్రేమ్స్ ఎఐ స్మార్ట్ గ్లాస్ గ్లాసెస్ మరియు ఈ స్మార్ట్ కళ్ళ జోడును అనేక ఆకర్షణీయమైన ఫీచర్స్ తో అందించింది.
రిలయన్స్ కొత్తగా అందించిన జియో ఫ్రేమ్స్ అనేది ఒక AI ఆధారిత స్మార్ట్ గ్లాసెస్ మరియు ఇది చాలా ఎఐ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇది అవ్వడానికి ఎఐ కళ్ళజోడు అయినా కూడా కంఫర్ట్ మరియు స్టైల్ రెండింటి కాంబినేషన్ తో ఉంటుంది. ఈ కళ్ళజోడు ఫ్రేమ్ లో రెండు హై క్వాలిటీ కెమెరాలు కలిగి ఉంటుంది. ఈ కెమెరాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫోటోలు మరియు వీడియోలు షూట్ చేయడానికి రెడీగా ఉంటాయి. అంతేకాదు, ఈ ఫోన్ కెమెరా మరియు AI సపోర్ట్ తో లైవ్ స్ట్రీమ్ కూడా చేయవచ్చు.
ఈ కొత్త ఎఐ కళ్లజోడు మ్యూజిక్ కూడా అందిస్తుంది. ఇందులో మీకు నచ్చిన మ్యూజిక్ ను ఎప్పుడైనా ఎక్కడైనా ఎంజాయ్ చేయవచ్చు. ముఖ్యంగా, ఈ కళ్ళజోడు కలిగిన AI సపోర్ట్ తో అడిగిన ప్రశ్నలకు సాధనాలు చెప్పడమే కాకుండా AI సహాయంతో సలహాలు మరియు సూచనలు కూడా అందిస్తుంది. ఈ కొత్త కళ్లజోడు మీ హెల్త్ కోచ్ గా కూడా సహాయం చేస్తుంది. మీరు అందించే వివరాలతో మీ హెల్త్ ట్రాక్ చేయడమే కాకుండా సలహాలు కూడా అందిస్తుంది.
జియో ఫ్రేమ్స్ హాండ్స్ ఫ్రీ కాలింగ్ సౌకర్యం కూడా అందిస్తుంది. ఈ కళ్లజోడు లో ఉన్న మైక్ మరియు స్పీకర్లు ఇందుకు సహాయం చేస్తాయి. కొత్త ప్లేస్ కి వెళ్లేప్పుడు ఇది మీకు మంచి ట్రాన్స్లేటర్ గా కూడా ఉపయోగపడుతుంది. ఇది ఎఐ సపోర్ట్ తో రియల్ టైమ్ ట్రాన్స్లేషన్ అందిస్తుంది. ఇది స్మార్ట్ రీడింగ్, చేతులకు కష్టం లేకుండా హ్యాండ్ ఫ్రీ పనులు చేస్తుంది.
Also Read: 5 వేల బడ్జెట్ ధరలో లభించే పవర్ ఫుల్ Soundbar Deals కోసం చూస్తున్నారా.!
ఈ కళ్లజోడు ప్రైస్ లేదా ఆఫర్ వివరాలు జియో ఇంకా ప్రకటించలేదు. అయితే, ఈ కళ్ళజోడు తీసుకోవాలి అని ఆసక్తి ఉన్న వారి కోసం ఇంట్రెస్ట్ రిజిస్ట్రేషన్ పేజీ అందించింది. ఇక్కడ మీ వివరాలతో రిజిస్టర్ చేసుకుంటే, జియో మిమ్మల్ని సంప్రదిస్తుంది.