జియో బంపర్ అఫర్ డేట్ ఎక్స్ టెన్షన్: జనవరి 7 వరకు పొడిగింపు

Updated on 04-Jan-2022
HIGHLIGHTS

రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం Happy New Year Offer ప్రకటించింది

రూ.2545 ప్రీపెయిడ్ ప్లాన్ ను ఈ ఆఫర్ లో భాగం చేసింది

ఈ అఫర్ జనవరి 7 వరకూ అందుబాటులో ఉంటుంది

కొత్త సంవత్సరం సంద్భర్భంగా రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం Happy New Year Offer ప్రకటించింది. రూ.2,545 ప్రీపెయిడ్ ప్లాన్ ను ఈ ఆఫర్ లో భాగం చేసింది మరియు ఈ ప్లాన్ తో కస్టమర్లకు 29 రోజుల అధిక వ్యాలిడిటీని జతచేసింది. అయితే, ముందుగా ఈ అఫర్ ను కేవలం 2022 జనవరి 2వ తేదీ వరకూ మాత్రమే వర్తించే పరిమిత అఫర్ గా తెలిపింది. కానీ, ఇప్పుడు ఈ అఫర్ డేట్ ను ఎక్స్ టెన్షన్ చేసింది మరియు ఈ అఫర్ జనవరి 7 వరకూ అందుబాటులో ఉంటుంది.   

Jio Happy New Year Offer:

ఈ ప్లాన్ రూ.2,545 రూపాయలకు వస్తుంది మరియు అఫర్ లో భాగంగా పూర్తి 365 రోజుల వ్యాలిటీని తీసుకువస్తుంది. వాస్తవానికి, ఈ ప్లాన్ ముందుగా 336 రోజుల వ్యాలిడిటీని మాత్రమే అఫర్ చేసేది. అయితే, జియో ప్రకటించిన  న్యూ ఇయర్ అఫర్ ద్వారా 29 రోజుల అదనపు వ్యాలిడిటీని కలుపుకొని ఇది మొత్తం పూర్తి సంవత్సరం వస్తుంది.

ఇక ఈ వ్యాలిడిటీ కాలానికి (336 రోజులు) గాను డైలీ 1.5 GB హై స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ ను కూడా ఆఫర్ అఫర్ చేస్తుంది. అంతేకాదు, డైలీ 100 SMS లిమిట్ తో పూర్తి 336 రోజులకు అందిస్తుంది మరియు అన్ని జియో యాప్స్ కి కాంప్లిమెంటరీ సబ్ స్క్రిప్షన్ ను కూడా తీసుకువస్తుంది.

ఇక తక్కువ ఖర్చుతో డైలీ అధిక హై స్పీడ్ డేటా మరియు వన్ ఇయర్ వ్యాలిడిటీ కోరుకునే వారికి కూడా జియో బెస్ట్ ప్లాన్ అందించింది. అదే, Jio Rs.3,119 ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్ ప్రయోజాలను ఈ క్రింద చూడవచ్చు.

Jio Rs.3,119 Plan

జియో యొక్క ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను డైలీ 2GB డేటా మరియు 10GB ఉచిత డేటాతో కలిపి మొత్తం 749 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, రోజుకు 100 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అధనంగా, అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. అధనంగా, 499 రూపాయల విలువైన Disney+ Hotstar మొబైల్ సబ్ స్క్రిప్షన్ ను కూడా ఉచితంగా అందిస్తుంది.   

మరిన్ని బెస్ట్ జియో ప్లాన్స్ కోసం ఇక్కడ Click చెయ్యండి 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :