Jio-Google: ఈ నెలలోనే సరసమైన 5G స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోందా?

Updated on 05-Jun-2021
HIGHLIGHTS

Jio-Google జతగా ఇండియాలో సరసమైన 5G స్మార్ట్ ఫోన్

5G స్మార్ట్ ఫోన్ల ను కూడా సరసమైన ధరకే తీసుకొచ్చే అవకాశం

44 వ AGM మీటింగ్ నుండి కొత్త స్మార్ట్ ఫోన్లను ప్రకటిస్తుందని అంచనా

Jio-Google జతగా ఇండియాలో సరసమైన 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనున్నాయి.  ఇదే ఇప్పుడు ఇండియాలో హాట్ టాపిక్. ఇండియాలో ఎక్కడ చుసిన ఈ విషయం పైన చర్చ కొనసాగుతోంది. ఇటీవల గూగుల్ CEO, సుందర్ పిచ్చాయ్ ఇండియాలో సరసమైన స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ కోసం జియోతో చాలా సన్నిహితంగా పనిచేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన తరువాత Jio-Google చవక స్మార్ట్ ఫోన్ల గురించి అంచనాలు మరింతగా పెరిగాయి.

ప్రస్తుతం, Jio-Google భాగస్వామ్యంతో కొత్త స్మార్ట్ ఫోన్లను తక్కువ ధరకే తీసుకువస్తే, ఇండియాలో ఇంకా 2G ఫోన్లకే పరిమితమైన కోట్ల మంది వినియోగదారులకు 4G ఫోన్లను అందించవచ్చు. అయితే, ఇదొక్కటే కాదు 5G స్మార్ట్ ఫోన్ల ను కూడా సరసమైన ధరకే తీసుకొచ్చే అవకాశం కూడా వుందని ఊహిస్తున్నారు.ఇంత ఎక్కువగా ఈ ఫోన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే, ఈ నెల 24 న తన 44 వ AGM మీటింగ్ ను నిర్వహిస్తున్నట్లు జియో ప్రకటించింది. ఈ AGM మీటింగ్ నుండి ప్రతి సంవత్సరం కూడా కొత్త ప్రోడక్ట్స్ ను లాంచ్ చెయ్యడం పరిపాటిగా సాగుతోంది. jioPhone, jioPhone 2 మరియు Jio Fiber తో సహా చాలా కొత్త నిర్ణయాలను ఈ మీటింగ్ నుండే ప్రకటిస్తుంది.

ఇప్పుడు కూడా ఇదే బాటలో ఈ AGM మీటింగ్ నుండి కొత్త స్మార్ట్ ఫోన్లను ప్రకటిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ జియో 44 వ AGM మీటింగ్ నుండి 4G మరియు 5G స్మార్ట్ ఫోన్లతో పాటుగా జియో చవక ల్యాప్ టాప్స్ మరియు 5G నెట్ వర్క్ కి సంబంధించి కూడా కీలక నిర్ణయాలు మరియు వివరాలను ప్రకటించవచ్చని టెక్ మరియు మీడియా వర్గాలు అంచనా వేస్తున్నారు. ఇదే గనుక నిజమైతే కొత్త స్మార్ట్ ఫోన్లను 'మేక్ ఇన్ ఇండియా' లో కూడా భాగంగా తీసుకురావచ్చు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :