జియో గిగా ఫైబర్ యాక్టివేషన్ పేరుతొ మోసం చేస్తున్న స్కామర్లు

Updated on 20-Oct-2020
HIGHLIGHTS

ఈ రకమైన కొత్త స్కామ్ ఇప్పుడు మొదలయ్యింది.

ఆగష్టు నెలలో జియో గిగా ఫైబర్ సేవలను ప్రారంభించవచ్చని వస్తున్నా అంచనాలను కొందరు స్కామర్లు సొమ్ముచేసుకోవాలని చూస్తున్నారు. మీకు ఈ మధ్యకాలంలో, జియో గిగా ఫైబర్ యాక్టివేషన్ రిక్వెస్ట్ పేరుతొ ఏమైనా మెయిల్ వచ్చిందా? అయితే దీన్ని అస్సలు నమ్మకండి. ఎందుకంటే, ఇటువంటి మెయిల్స్ జియో ఇంతవరకు ఎవరికి పంపలేదు. ఈ రకమైన కొత్త స్కామ్ ఇప్పుడు మొదలయ్యింది.

ఈ రకమైన వాటిని కనుగొన్నట్లు TOI ముందుగా నివేదిక అందించింది. ఈ నివేదిక ప్రకారం, గత సంవత్సరం జూలై నెలలో బీటా టెస్టింగ్ కోసం కొంత మంది వినియోగధారులకు ఈ సేవలను ఉచితంగా అందించింది. అది మంచి ఫలితాలను ఇవ్వడంతో పాటుగా అతితక్కువ ధరకే అన్ని సర్వీసులను అందించనున్నదన్న సమాచారంతో, అందరి చూపు జియో గిగా ఫైబర్ పైన పడింది. అయితే, ఈ విషయాన్నే సొమ్ము చేసుకోవాలని కొందరు స్కామర్లు కొత్త స్కాములను తెరపైకి తీసుకువచ్చారు.

ముందుగా, అచ్చంగా జియో నుండి వచ్చినట్లు గా కనిపించేలా ఒక మెయిల్ ని తయారు చేసి కొంతమందికి ర్యాండంగా ( యాదృచ్చికంగా ) పంపిస్తారు. దీన్ని చూస్తే ఇది నిజమేనేమో అనిపించేలా చాలా బాగా కనిపిస్తుంది. కానీ ఇది స్కామర్లు పంపించిన మెయిల్ . ఇందులో "జియో గిగా ఫైబర్ యాక్టివేషన్ రిక్వెస్ట్" అని ఉంటుంది. అంటే, ఈ జిఓ గిగా ఫైబర్ సేవలను యాక్టివేట్ చేసుకోవడానికి రిక్వెస్ట్ అని ఈ మెయిల్ మీకు చెబుతుంది. ఒకవేళ మీరు నమ్మినట్లయితే, మీరు పూర్తిగా మోసపోతారు. మనకు తెలుసు జియో సేవలను పొందాలంటే 2,500 రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి, వాళ్ళు మిమ్మల్ని అనేకరకాలుగా మోసం చేసే అవకాశం ఉంటుంది. 

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :