రిలయన్స్ జియో ఫెస్టివ్ సీజన్ సందర్భం గా తన 4G హాట్ స్పాట్ jio fi యొక్క ధర భారీగా తగ్గించింది . ఈ తగ్గింపును ఫెస్టివల్ సీజన్ ని దృష్టిలో పెట్టుకుని యూజర్స్ కి అతి తక్కువ ధరకే ఇస్తుంది . ఇప్పుడు 4G హాట్ స్పాట్ jio fi ని ఈ కామర్స్ దిగ్గజం ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ అమెజాన్ లో అతి తక్కువ ధరకే లభిస్తుంది . మామూలుగా ఈ డివైస్ యొక్క అసలు ధర అమెజాన్ లో Rs. 2,329 కానీ ప్రస్తుతం ఫెస్టివల్ సేల్ పురస్కరించుకుని అమెజాన్ దీనిపై ఏకంగా 57% డిస్కౌంట్ ని యూజర్స్ కి అందిస్తుంది . ఈ డిస్కౌంట్ తరువాత కేవలం Rs. 999 లో ఈ డివైస్ ని యూజర్స్ తమ సొంతం చేసుకోవచ్చు . అంటే ఈ డిస్కౌంట్ ద్వారా మీకు మొత్తం 1,330 రూ వరకు డబ్బు ఆదా అవుతుంది . 20 సెప్టెంబర్ నుంచి దీని ధర Rs. 999 గా నిర్ణయించబడింది . ఈ ధర సెప్టెంబరు 30వరకు కొనసాగుతుంది.
ఈ డివైస్ మీకు బ్లాక్ కలర్ లో అందుబాటులో ఉంటుంది . 16 మిల్లీ మీటర్స్ హైట్ కలిగి ,5. 5 సెంటీమీటర్స్ విడ్త్ మరియు 86 గ్రామ్స్ బరువు ని కలిగి వుంది .
JioFi M2S లో 2300mAh బ్యాటరీ కలదు . దీనితో పాటుగా JIO SIM కార్డ్ కూడా లభ్యం . 2G / 3G స్మార్ట్ ఫోన్లలో 4G ఫీచర్స్ ఎంజాయ్ చేయవచ్చు .
వీడియో మరియు HD వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు , ఆడియో మరియు వీడియో కాన్ఫరెన్స్ , Jio 4G వాయిస్ యాప్ తో SMS ను పంపండి.
స్మార్ట్ ఫోన్ , లాప్టాప్ , టాబ్లెట్స్ ఇంకాస్మార్ట్ TV కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు .
ఫ్లిప్కార్ట్ లో ఈ స్మార్ట్ఫోన్ల ఫై భారీ డిస్కౌంట్స్ , ఈరోజే .