జియో బంపర్ అఫర్: రూ.399 కే అన్లిమిటెడ్ లాభాలు మరియు ఉచిత OTT సబ్ స్క్రిప్షన్ పొందండి

Updated on 31-Jan-2022
HIGHLIGHTS

ఈ జియో ప్లాన్ డేటా, కాలింగ్ మరియు మరిన్ని లాబాలాను అందిస్తుంది

Netflix, Prime మరియు డిస్ని+ హాట్ స్టార్ యొక్క ఉచిత సబ్ స్క్రిప్షన్ అందించే బెస్ట్ ప్లాన్

ప్రస్తుతం OTT ప్లాట్‌ఫారమ్స్ పైన లేటెస్ట్ మరియు ఎక్కువగా కంటెంట్ లభిస్తోంది

ప్రస్తుతం OTT ప్లాట్‌ఫారమ్స్ పైన లేటెస్ట్ మరియు ఎక్కువగా కంటెంట్ లభిస్తోంది. అయితే, OTT ప్లాట్‌ఫారమ్స్ కోసం నెల నెల డబ్బును చెల్లించవలసి వస్తుంది. అందుకే, దీని దృష్టిలో ఉంచుకొని జియో ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్స్ అయిన Netflix, అమెజాన్ ప్రైమ్ మరియు డిస్ని+ హాట్ స్టార్ యొక్క ఉచిత సబ్ స్క్రిప్షన్ అందించే బెస్ట్ ప్లాన్ లను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ లను పోస్ట్‌పెయిడ్ కస్టమర్ల కోసం అందించింది. రూ.399 ప్లాన్ వీటిలో బెస్ట్ అని చెప్పొచ్చు మరియు ఈ ప్లాన్ అధిక డేటా అన్లిమిటెడ్ కాలింగ్ మరియు మరిన్ని లాబాలాను అందిస్తుంది.

Jio రూ.399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్

జియో యొక్క ఈ రూ.399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ఒక నెల రెంటల్ ప్లాన్ మరియు ఇది బిల్ వ్యవధికి గాను 75 GB హై స్పీడ్ డేటాని తీసుకువస్తుంది. అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100SMS లిమిట్ కూడా వుంది. ఈ ప్లాన్ తో Netflix, అమెజాన్ ప్రైమ్ మరియు డిస్ని+ హాట్ స్టార్ లకు ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా పొందుతారు. అంతేకాదు, మీరు 200 GB వరకు డేటాని రోల్ అవుట్ కూడా చేసుకోవచ్చు.

ఇదే లాభాలను అఫర్ చేసే మరొక రెండు ప్లాన్స్ ని కూడా అందించింది. ఇవి మీ ఫ్యామిలీ ప్లాన్స్ మరియు ఈ ప్లాన్స్ మీకు అధనపు SIM కార్డ్ ను కూడాతీసుకువస్తాయి. అందులో ఒకటి రూ.599 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ మరియు మరొకటి రూ.799 పోస్ట్‌పెయిడ్ ప్లాన్. వీటిలో రూ.599 ప్లాన్ 1 సిమ్ కార్డ్ తో వస్తుంది. రూ.799 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ మాత్రం 2 అదనపు సిమ్ కార్డ్ లను తీసుకువస్తుంది.

మరిన్ని జియో బెస్ట్ ప్లాన్స్ కోసం Click Here      

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :