జియో బెస్ట్ అన్లిమిటెడ్ ప్లాన్: పాత ప్లాన్ తిరిగి తీసుకొచ్చిన జియో

Updated on 22-Jan-2022
HIGHLIGHTS

జియో కస్టమర్లకు అధిక లాభాలను అందించే పాత అన్లిమిటెడ్ ప్లాన్ ను తిరిగి తీసుకొచ్చింది

ఈ ప్లాన్ డైలీ అధిక డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు మరిన్ని ప్రయోజాలను అందిస్తుంది

ఈ ప్లాన్ కస్టమర్లకు అధికలాభాలను అందిస్తుంది

జియో కస్టమర్లకు అధిక లాభాలను అందించే పాత అన్లిమిటెడ్ ప్లాన్ ను తిరిగి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ డైలీ అధిక డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు మరిన్ని ప్రయోజాలను అందిస్తుంది. ముఖ్యంగా, ఈ ప్లాన్ 1 సంవత్సరం 499 రూపాయల విలువైన డిస్నీ+ హాట్ స్టార్ మొబైల్ సబ్ స్క్రిప్షన్ ఉచితంగా అందిస్తుంది. అదే ఇటీవల జియో తిరిగి ప్రవేశపెట్టిన రూ.499 ప్రీపెయిడ్ ప్లాన్.

Jio Rs.499 Plan

ఈ ప్లాన్ కస్టమర్లకు అధికలాభాలను అందిస్తుంది. ఎందుకంటే, ఈ ప్లాన్ తో డైలీ 2GB హై స్పీడ్ డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్ ను కూడా పొందుతారు. ఇది మాత్రమే కాదు, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత  యాక్సెస్ ను తీసుకువస్తుంది. ఇది 28 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. అధనంగా, పైన తెలిపిన విధంగా ఈ ప్లాన్ 1 సంవత్సరం 499 రూపాయల విలువైన డిస్నీ+ హాట్ స్టార్ మొబైల్ సబ్ స్క్రిప్షన్ ఉచితంగా అందిస్తుంది. కొత్త వినియోగదారులు ఈ ప్లాన్‌తో జియో ప్రైమ్ మెంబర్‌షిప్‌కు కూడా సభ్యత్వాన్ని కూడా అందుకుంటారు.

అలాగే, అధిక ప్రయోజనాలతో పాటుగా ఈ ప్లాన్ 1 సంవత్సరం 499 రూపాయల విలువైన డిస్నీ+ హాట్ స్టార్ మొబైల్ సబ్ స్క్రిప్షన్ ఉచితంగా అందించే మరోక ప్లాన్ Jio Rs.799 Plan మరియు దీని గురించి క్రింద చూడవచ్చు.   

Jio Rs.799 Plan

Jio Rs.799 Plan కూడా ఇదే విధమైన అధిక లాభాలను అందిస్తుంది. రూ. 799 ప్లాన్ డైలీ 2GB హై స్పీడ్ డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్ ను అందిస్తుంది. అలాగే, ఈ ప్లాన్ డైలీ 100 SMS ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత  యాక్సెస్ ను తీసుకువస్తుంది. ఇది 56 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఈ ప్లాన్ కూడా 1 సంవత్సరం 499 రూపాయల విలువైన డిస్నీ+ హాట్ స్టార్ మొబైల్ సబ్ స్క్రిప్షన్ ఉచితంగా అందిస్తుంది. 

మరిన్ని Jio ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం Click Here

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :