జియో కస్టమర్లకు ఉచితంగా OTT సబ్ స్క్రిప్షన్ అందించే బెస్ట్ ప్లాన్స్

Updated on 24-Nov-2021
HIGHLIGHTS

జియో తన వినియోగదారుల కోసం జబర్దస్త్ అఫర్లను ప్రకటించింది

డిస్నీ+ హాట్ స్టార్ కి అన్ రిస్ట్రిక్టెడ్ యాక్సెస్

ఎటువంటి రిస్ట్రిక్షన్ లేకుండా యాక్సెస్ లభిస్తుంది

రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం జబర్దస్త్ అఫర్లను ప్రకటించింది. జియో ఇటీవల తీసుకొచ్చిన కొన్ని ప్రముఖ OTT ప్లాట్ఫారం డిస్నీ+ హాట్ స్టార్ కి అన్ రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ ను తీసుకువస్తాయి. ఈ ప్లాన్స్ కేవలం 1 నెల వ్యాలిడిటీ మొదలుకొని 1 సంవత్సరం వ్యాలిడిటీ వరకు అందించింది. ఈ ప్లాన్లను రీఛార్జ్ చేసే జియో కస్టమర్లకు ఎటువంటి పరిమితి లేకుండా డిస్నీ+ ఒరిజినల్,టీవీ షో లు, HBO, Marvel StarWars వంటి చాలా వాటికీ ఎటువంటి రిస్ట్రిక్షన్ లేకుండా యాక్సెస్ లభిస్తుంది. మరి ఆ ప్రీపెయిడ్ ప్లాన్స్ వివరాలను తెలుసుకుందామా..!

1.రూ.499 ప్రీపెయిడ్ ప్లాన్

ఈ రూ.499 ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్వర్కులకు అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, డైలీ 3జిబి హై స్పీడ్ డేటా లాభాలను 28 రోజుల వ్యాలిడిటీ తో తీసుకువస్తుంది. ఈ ప్లాన్ యొక్క ఇతర ప్రయోజనాలవిషయానికి వస్తే, ఈ ప్లానుతో మీకు డిస్నీ+ హాట్ స్టార్ VIP యాక్సెస్ లభిస్తుంది. 3GB హై స్పీడ్ 4G డేటాతో పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను 84 GB డేటాని మరియు Jio Apps కి కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ ను కూడా అందిస్తుంది.

2.రూ.666 ప్రీపెయిడ్ ప్లాన్

ఈ రూ.666 ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్వర్కులకు అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, డైలీ 2జిబి హై స్పీడ్ డేటా లాభాలను 56 రోజుల వ్యాలిడిటీ తో తీసుకువస్తుంది. ఈ ప్లాన్ యొక్క ఇతర ప్రయోజనాలవిషయానికి వస్తే, ఈ ప్లానుతో మీకు డిస్నీ+ హాట్ స్టార్ VIP యాక్సెస్ లభిస్తుంది. 2GB హై స్పీడ్ 4G డేటాతో పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను 112 GB డేటాని మరియు Jio Apps కి కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ ను కూడా అందిస్తుంది.

3.రూ.888 ప్రీపెయిడ్ ప్లాన్

ఈ రూ.888 ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్వర్కులకు అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, డైలీ 2 జిబి హై స్పీడ్ డేటా లాభాలను 84 రోజుల వ్యాలిడిటీ తో తీసుకువస్తుంది. ఈ ప్లాన్ యొక్క ఇతర ప్రయోజనాలవిషయానికి వస్తే, ఈ ప్లానుతో మీకు డిస్నీ+ హాట్ స్టార్ VIP యాక్సెస్ లభిస్తుంది. 2GB హై స్పీడ్ 4G డేటాతో పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను 168 GB డేటాని మరియు Jio Apps కి కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ ను కూడా అందిస్తుంది.

అలాగే, రూ. 549 యాడ్ ఆన్ ప్యాక్ తో కూడా ఈ డిస్నీ+ హాట్ స్టార్ VIP ని చేసింది మరియు ఇది రోజుకు 1.5జిబి హాయ్ స్పీడ్ డేటా తో 56 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అంతేకాదు, ఇప్పటికే అందుబాటులో ఉన్న 1 సంవత్సరం ప్లాన్ రూ.2599 తో కూడా ఈ డిస్నీ+ హాట్ స్టార్ VIP ప్రయోజనాన్ని జతచేసింది.

ఇక ఈ రిలయన్స్ జియో యొక్క లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ విషయానికి వస్తే, ఇది పూర్తి సంవత్సరం వ్యాలిడిటీని అందిస్తుంది. జియో యొక్క ఈ ప్లానుతో అన్ని నెట్వర్కులకు  అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, డైలీ 100 SMS,  మరియు 365 రోజుల చెల్లుబాటును కలిగి ఉంది. ఈ ప్లానుతో మీకు డైలీ 2 GB హై స్పీడ్ 4G డేటాతో పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను 730 GB డేటాని మరియు Jio Apps కి కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ ను కూడా అందిస్తుంది. అధనంగా, 399 రుపాయల విలువగల Disney+ Hotstar VIP సంవత్సరం సబ్ స్క్రిప్షన్ ఉచితంగా అందిస్తుంది.

మరిన్ని Jio ప్లాన్స్ కోసం ఇక్కడ Click చేయండి.

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :