1,999 రూపాయల Jio WiFi ని కేవలం 94 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు

Updated on 18-Aug-2020
HIGHLIGHTS

ప్రస్తుతం జియో ప్రతి ఒక్కరికి WiFi అందించే విధంగా JioFi ని ప్రతినెలా అతితక్కువ EMI చెల్లించి సొంతం చేసుకునే అవకాశం తీసుకొచ్చింది.

రూ.1,999 విలువగల JioFi ని నెలకు కేవలం రూ. 94 రూపాయలు చెల్లించడం ద్వారా మీరు కొనవచ్చు.

ఇప్పుడు JioFi ని మీరు మాస్ EMI తో కొనుగోలు చెయ్యవచ్చు మరియు ఇతర ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో, డేటా ఎక్కువగా అవసరం ఉన్నవారి కోసం Jio WiFi ఆఫర్ అందుబాటులో ఉన్న వాటిలో బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే, ప్రస్తుతం జియో ప్రతి ఒక్కరికి WiFi అందించే విధంగా JioFi ని ప్రతినెలా అతితక్కువ EMI  చెల్లించి సొంతం చేసుకునే అవకాశం తీసుకొచ్చింది. రూ.1,999 విలువగల JioFi ని  నెలకు కేవలం రూ. 94 రూపాయలు చెల్లించడం ద్వారా మీరు కొనవచ్చు.  అంటే, ఇప్పుడు మీరు వాటిని మాస్ EMI తో కొనుగోలు చెయ్యవచ్చు మరియు ఇతర ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

జియో ఫోన్ ఆఫర్లు

రూ .75 రీఛార్జ్ తో , జియో ఫోన్ కస్టమర్లకు రోజుకు 0.1 జిబి డేటా లభిస్తుంది .ఇది జియో ఫోన్ కస్టమర్లకు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు జియో నుండి ఇతర నెట్వర్క్ కనెక్షన్లకు 500 నిమిషాలు కాల్స్ అందిస్తుంది.  ఈ అఫర్ 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. అంతేకాకుండా 50 ఎస్ఎంఎస్ & జియో అప్లికేషన్లకు కాంప్లిమెంటరీ చందాతో వస్తుంది.

125 రూపాయల రీఛార్జ్ కోసం, జియో ఫోన్ కస్టమర్లకు రోజుకు 0.5 జీబీ డేటా, ప్లస్ జియో నుండి జియోకు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు మరిన్ని లభిస్తాయి. ఈ ఆఫర్లు జియో ఫోన్ కస్టమర్లకు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు ఇతర నెట్వర్క్ కనెక్షన్లకు 500 నిమిషాలు కాల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్ 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది మరియు 300 ఎస్ఎంఎస్ & కాంప్లిమెంటరీ యాక్సెస్ అందిస్తుంది.

రూ .155 రీఛార్జ్ , జియో ఫోన్ కస్టమర్లకు రోజుకు 1 జిబి డేటా లభిస్తుంది .ఇది జియో నుండి జియో అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు జియో ఫోన్ నుండి ఇతర కస్టమర్లకు 500 నిమిషాలు కాలింగ్ సౌకర్యం అందిస్తుంది. వినియోగదారులు 28 రోజుల వ్యాలిడిటీ మరియు ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్ & జియో అప్లికేషన్లకు  (కాంప్లిమెంటరీ చందా) అందుకుంటారు. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :