సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన 'జయమ్మ పంచాయతీ' ఈరోజు OTT లో రిలీజ్ అయ్యింది. మే 6 న సినిమా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ మూవీగా నిలిచింది. ఈ సినిమా కథ మరియు సుమ యాక్టింగ్ తో పాటుగా పూర్తిగా పల్లెటూరి వాతావరణం ఆకట్టుకునే అంశాలు. అంతేకాదు, సినిమా చూసిన ప్రతిఒక్కరూ కూడా సుమ యాక్టింగ్ గురించే ఎక్కువగా మాట్లాడారు. ఈ సినిమా ఈరోజు అమెజాన్ ప్రైమ్ వీడియో లో రిలీజ్ అయ్యింది.
బలగ ప్రకాశ్ నిర్మాతగా కలివరపు విజయ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ హై డ్రామా మూవీ పలువురి ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా, సుమ కనకాల నటన ఈ చిత్రానికి ప్రాణం పోసినట్లు పలువురు ప్రముఖులు కితాబు పలికారు. ఈ సినిమాలో దినేష్ మరియు షాలినీ హీరో హీరోయిన్లుగా నటించారు. సినిమా పేరుకు తగ్గట్టుగానే కథ మొత్తంగా గ్రామీణ వాతావరణంలోనే సాగుతుండడమే కాకుండా కావాలి;కావాల్సినంత కామెడీ మరియు డ్రామా ఈ సినిమాలో చూడవచ్చు.
ఇక కథ విషయానికి వస్తే, శ్రీకాకుళంలోని ఒక గ్రామంలో హాయిగా జీవించే ఒక సగటు కుటుంబంలో కుటుంబ పెద్ద (జయమ్మ భర్త) కి హఠాత్తుగా జబ్బు చేయడంతో జరిగే పరిణామాలు గురించి చెబుతుంది ఈ సినిమా. తన భర్త కోసం జయమ్మ(సుమ) పంచాయితీ పెద్దలను ఆశ్రయిస్తుంది. ఆ తరువాత ఏమిజరిగింది అనేది ఈ చిత్రం. సినిమా థియేటర్లలో చూడలేక పోయామనే వారు ఈ సినిమాను OTT లో చూడవచ్చు. 'జయమ్మ పంచాయతీ' మూవీ జూన్ 14, అంటే ఈరోజు నుండి ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది.