నేటి జీవితంలో స్మార్ట్ ఫోన్ లు చాలా ఉపయోగకరమైన మరియు అవసరమైన విషయం. ఫోన్ లేకుండా ఏది చేయ్యాలన్నాకష్టం. అయితే, మనకు బాగా ముఖ్యమైన పని వున్న సమయంలో ఫోన్ పనిచేయకపోతే, అప్పుడు కోపం ఒక్కసారిగా కట్టలు తెచ్చుకుంటుంది. నేటి జీవితంలో మనమందరం స్మార్ట్ ఫోన్‌లు లేకుండా దాదాపుగా ఈ పని చేయలేం, అంతగా అలవాటుపడ్డాం మరి. అన్ని పనులకు అవసరపడే మొబైల్ హ్యాంగ్ అవ్వడం కూడా అప్పుడప్పుడు, కొందరికి ఎప్పుడూ జరుగుతూ వుంటుంది.
మీలో చాలామంది మొబైల్ హాంగ్ సమస్యతో బాధపడుతున్నారా! కానీ, ఫోన్ హ్యాంగ్ సమస్య ఎందుకు వస్తుందో, ఈ సమస్యను ఎలా వదిలించుకోవాలో మీరు తెలుసుకోవడం చాలా అవసరం. అందుకే ,ఈరోజు మేము మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియజేస్తాము.
మా ఫోన్‌లో చాలా యాప్స్ ఉంటాయి, కానీ కొన్ని మాత్రం చాలా అరుదుగా ఉపయోగించబడతాయి మరియు పనికిరాని అన్ని యాప్స్ మొబైల్‌లో స్టోర్ చేయబడతాయి. ఒక స్మార్ట్ ఫోన్ ఎక్కువగా హ్యాంగ్ అవ్వడానికి ఇదే పెద్ద కారణం. ఈ యాప్స్, ఫోన్ పర్ఫార్మెన్సును మరియు ర్యామ్ ని తింటాయి మరియు తెలియకుండానే ఈ యాప్స్ ఆటొమ్యాటిగ్గా అప్డేట్ అవుతుంటాయి. ఫలితంగా, ఫోన్ స్టోరేజి కూడా నిండిపోతుంది మరియు ఫోన్ సమస్య మరింత అధికమవుతుంది.
ఫోన్ హ్యాంగ్ అవ్వడానికి మరొక కారణం ఫోన్ అప్డేట్ గా లేకపోవడం. స్మార్ట్ ఫోన్స్ ఎల్లప్పుడూ అప్డేటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ (OS) ను ఉపయోగించాలి. ఫోన్‌లో ఏదైనా క్రొత్త అప్డేట్స్ ఉన్నాయా అని చూడటానికి ఫోన్ సెట్టింగ్స్ ఎంపికకు వెళ్లండి. ఫోన్ అప్‌డేట్ అయితే హ్యాంగ్ సమస్య కూడా తగ్గిపోతుంది .
ఏదో ఒక సమయంలో మీ ఫోన్‌లో స్టోరేజ్ నిండుకునట్లు కనిపిస్తుంది. ఇలా జరిగితే, Android ఫోన్ హ్యాక్ లేదా ఏదైనా ఫోన్‌తో ఈ సమస్యను ఎదుర్కొంటున్నాము. కాబట్టి, ఫోన్ స్టోరేజిని ఎప్పటికప్పుడు ఖాళీ చేయాలి. మీ ఫోన్‌లో ఉపయోగించని వాటిని ఎప్పటికప్పుడు తొలగించాలి. ఇది ఫోన్ హ్యాంగింగ్ సమస్యను తొలగిస్తుంది