KGF చాఫ్టర్ 2 బాక్సాఫీస్ వద్ద సునామి సృష్టించింది. అంతేకాదు, KGF చాఫ్టర్ 3 గురించి టీజ్ చేసి థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్య పరిచింది. అంతే, KGF చాఫ్టర్ 2 సినిమా 2022 బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచినా విషయం తెలిసిందే. అయితే, KGF చాఫ్టర్ 3 గురించి సినిమా సెట్స్ మీదకు వెళ్లకుండానే భారీ హిప్ సృష్టించడం మరింత అంచనాలకు దారి తీసింది. అందుకే, ఈ అప్ కమింగ్ మూవీ పైన అనేక రూమర్లు, అంచనాలు మరియు కొత్త విషయాలు ఆన్లైన్లో తెగ తిరుగుతున్నాయి. ఇప్పుడు KGF చాఫ్టర్ 3 గురించి మరొక కొత్త విషయం చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే, KGF చాఫ్టర్ 3 లో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ నటించబోతున్నారు, అనే వార్త. మరి కొత్త రూమర్ లో నిజమెంత అబద్దమెంతో వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే, KGF చాఫ్టర్ 3 ఈ సంవత్సరంలో సెట్స్ మీదకు వెల్లబోవడం లేదు.
వాస్తవానికి, KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ 'సలార్' కోసం పనిచేస్తూ బిజీ అయ్యారు. అలాగే, KGF చాఫ్టర్ 2 ను మించిన మెస్మరైజింగ్ యాక్షన్ సీన్స్ ను సలార్ లో అందించే దిశగా సినిమా బడ్జెట్ ను కూడా పెంచినట్లు కూడా రూమర్. అందుకే, KGF చాఫ్టర్ 3 ఈ సంవత్సరం సెట్స్ మీదకు వెల్లబోవడం లేదు. అయితే, ఈ సినిమా గురించి ఆన్లైన్లో మాత్రం ఇప్పటి నుండే హైప్ ఎక్కువవుతోంది. ఇప్పటికి, KGF చాఫ్టర్ 2 థియేటర్ల వద్ద సందడి చేయడంతో పాటుగా అమెజాన్ ప్రైమ్ వీడియో నుండి రెంటల్ సబ్ స్క్రిప్షన్ తో కూడా అందుబాటులో వుంది. ఈ సినిమా ఇప్పటికి తన వసూళ్ల పరంపర కొనసాగిస్తోంది.
ఇక KGF చాఫ్టర్ 3 లో హృతిక్ రోషన్ నటించబోతున్నారు అనే రూమర్ విషయానికి వస్తే, కేజీఎఫ్ చాఫ్టర్ 3 లో హృతిక్ రోషన్ కనిపిస్తాడా లేదా అనే దాని గురించి నిర్మాత విజయ్ కిరగందూర్ మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హృతిక్ రోషన్ ను కూడా పార్టిసిపేట్ చేసే ఆలోచనలో ఉన్నాం మరియు స్టార్ డేట్స్ చూసుకుంటూ కేజీఎఫ్3 మొదలుపెట్టాలి అని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, ప్రశాంత్ నీల్ మరియు రాకింగ్ స్టార్ యష్ డేట్స్ తర్వాత మిగిలిన నటీనటుల గురించి మాట్లాడుకోవచ్చని అని చెప్పుకొచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఇందులో నిజమెంతో పక్కాన పెడితే, ఇప్పటికే నార్త్ బెల్ట్ తో సహా ప్రపంచ వ్యాప్తంగా KGF చాఫ్టర్ 3 గురించి చర్చ కొనసాగుతోంది. కాబట్టి, ఈ అప్ కమింగ్ పార్ట్ లో బాలీవుడ్ తో సహా పెద్ద స్టార్ లను రంగంలోకి దించవచ్చని సినిమా వర్గాలు అంచనా వేస్తున్నారు.