IRCTC Big News for advance booking and the new rules starts from 1 November 2024
IRCTC Big News: భారతీయ రైల్వే శాఖ అడ్వాన్స్ బుకింగ్ కోసం కొత్త నియాలను ప్రకటించింది. ఈ కొత్త నియమాల ప్రకారం ట్రైన్ టికెట్ లను ఎప్పుడంటే అప్పుడు బైక్ చేయడం కుదరదు. ఇప్పుడు ఉన్న బుక్ కాలాన్ని కుదిస్తూ కొత్త రూల్స్ ను తీసుకు వచ్చింది. అంతేకాదు, ఈ కొత్త రూల్స్ నవంబర్ 1 వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని కూడా తెలిపింది.
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC) అడ్వాన్స్ బుకింగ్ టైం ను కుదిస్తున్నట్లు కొత్త ప్రకటన చేసినట్లు TOI నివేదించింది. ఈ నివేదిక ప్రకారం, ప్రస్తుతం 120 రోజుల వరకు టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉండగా, ఈ సమయాన్ని 60 రోజులకు కుదిస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఈ కొత్త అడ్వాన్స్ బుకింగ్ రూల్స్ నవంబర్ 1 నుంచి అమల్లోకి కూడా వస్తాయి.
అంటే, నవంబర్ 1 నుంచి ట్రైన్ టికెట్ లను ముందుగా బుక్ చేసే ప్రయాణికులు కేవలం 2 నెలల ముందు మాత్రమే బుక్ చేసుకునే అవకాశం వుంది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC) తీసుకున్న ఈ కొత్త నిర్ణయంతో నాలుగు నెలల ముందస్తు బుకింగ్ అవకాశం రెండు నెలలకు మాత్రమే వర్తిస్తుంది.
ఈ కొత్త చర్య ద్వారా సరైన ప్లానింగ్ తో టికెట్ అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మరియు ఎక్కువగా అవుతున్న క్యాన్సిలేషన్ సంశయాలను తగ్గించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. వాస్తవానికి, చాలా ముందుగా బుకింగ్ చేసుకోవడం వలన ఈ లాంగ్ పిరియడ్ లో క్యాన్సిలేషన్ సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది.
Also Read: ఇంటిని షేక్ చేసే 600W Sony Soundbar పై భారీ డిస్కౌంట్ ప్రకటించిన అమెజాన్ సేల్.!
అయితే, అక్టోబర్ 31 వ ఇతడి వరకు టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే వారికి ప్రస్తుతం నడుస్తున్న 120 రోజుల అడ్వాన్స్ బుకింగ్ వర్తిస్తుంది. అంతేకాదు, రైల్వే టికెట్ బుకింగ్ మరియు ఫుడ్ చెకింగ్ కోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను సహాయం తీసుకున్నట్లు మరియు దీని మంచి ఫలితాలు సాధిస్తున్నట్లు కూడా ఈ నివేదిక తెలిపింది.