IPL 2022: లక్నో సూపర్ జెయింట్స్ పై చెమటోడ్చి గెలిచిన గుజరాత్ టైటాన్స్

Updated on 29-Mar-2022
HIGHLIGHTS

లక్నో సూపర్ జెయింట్స్ vs గుజరాత్ టైటాన్స్

వాంఖడే స్టేడియంలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 6 వ లీగ్ మ్యాచ్

GT (గుజరాత్ టైటాన్స్) 5 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది

IPL 2022: వాంఖడే స్టేడియంలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 4 వ లీగ్ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ మరియు గుజరాత్ టైటాన్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో LSG (లక్నో సూపర్ జెయింట్స్) పైన GT (గుజరాత్ టైటాన్స్) 5 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మొదటిసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ బరిలోకి దిగినా కూడా ఫస్ట్ మ్యాచ్ తోనే విజయకేతనం ఎగరవేసింది. అయితే, మ్యాచ్ నెగ్గడానికి చాలా చెమోటోడాల్సి వచ్చింది.

టాస్ నెగ్గి తొలుత బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. మొదటి బాల్ తో మొదటి వికెట్ తీసి మొహమ్మద్ సమీ ఆదిలోనే లక్నో సూపర్ జెయింట్స్ కు అడ్డుకట్ట వేశాడు. అట ఆరంభంలోనే మొదటి బంతికి KL రాహుల్ వెనుతిరగడంతో పాటుగా లక్నో సూపర్ జెయింట్స్ వరుసగా కీలకమైన వికెట్లను వరుసగా కోల్పోయింది. అయితే, దీపక్ హూడా మరియు ఆయుష్ బదోని ఇద్దరూ కలిసి స్కోర్ బోర్డు ను పరుగులు పెట్టించారు. దీపక్ హూడా 41 బంతుల్లో 55 పరుగులు చేయగా ఆయుష్ బదోని 41 బంతుల్లో 54 పరుగులతో మ్యాచ్ ను గడిలో పెట్టారు. చివరిలో వచ్చిన కృనాల్ పాండ్యా కూడా మెరుపు బ్యాటింగ్ తో 13 బంతుల్లోనే 3 ఫోర్ లతో 21 పరుగులు సాధించింది 159 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ కి ఇచ్చారు.

ఈజీ టార్గెట్ ను చేధించేందుకు దిగిన గుజరాత్ టైటాన్స్ కూడా ఆరంభంలో తడబడింది. గుజరాత్ టైటాన్స్ కూడా ఆరంభంలోనే రెండు కీలకమైన వికెట్లు కోల్పోయింది.  మొదటి మూడు ఓవర్లకే ఓపెనర్లు శుబ్ మన్ గిల్ మరియు విజయ్ శంకర్ ఇద్దరు కూడా పెవిలియన్ కు చేరుకున్నారు. అయితే, మ్యాచ్ ను చక్కదిద్దెందుకు వచ్చిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య మరియు మాథ్యూ వేడ్ లు స్కోర్ ను నిలకడగా పెంచారు. హార్దిక్ పాండ్య 33 పరుగులతో తో మరియు మాథ్యూ వేడ్ 30 పరుగులతో ఇద్దరు కలిసి స్కోర్ వేగం పెంచారు. అయితే, ఈ ఇద్దరు కూడా వెంట వెంటనే అవుట్ అయ్యారు. తరువాత వచ్చిన రాహుల్ తేవాతియ మరియు డేవిడ్ మిల్లర్ ఇద్దరు రన్ రేట్ ను పెంచారు. రాహుల్ తేవాతియ 43 పరుగులతో చివరి వరకూ క్రీజ్ లో నిలవగా, డేవిడ్ మిల్లర్ 30 పరుగులు సాదించారు. చివరి ఓవర్ లో రాహుల్ తేవాతియ ఇంకా రెండు బంతులు మిగిలి వుండగానే బౌండరీతో మ్యాచ్ ను ముగించాడు. గుజరాత్ టైటాన్స్ 161/5 (19.4) తో విజయాన్ని సొంతం చేసుకొని IPL 2022 లో బోణి కొట్టింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :