Sarvam AI: విదేశీ ఏఐ ప్లాట్ ఫామ్స్ కి పోటీగా స్వదేశీ ఏఐ వచ్చేసింది.!

HIGHLIGHTS

విదేశీ ఏఐ ప్లాట్ ఫామ్స్ కి పోటీగా స్వదేశీ ఏఐ వచ్చేసింది

బెంగళూరు బేస్డ్ ఏఐ ప్లాట్ ఫామ్ సర్వం AI ని ప్రపంచానికి పరిచయం చేశారు

స్వదేశీ పరిజ్ఞానం మరియు విలువలతో కూడిన వివరాలతో ఈ కొత్త ఏఐ మోడల్ విడుదల

Sarvam AI: దేశంలో విదేశీ ఏఐ ప్లాట్ ఫామ్స్ రాజ్యమేలుతున్న సమయంలో ఇప్పుడు వాటికి పోటీగా కి పోటీగా స్వదేశీ ఏఐ వచ్చేసింది. బెంగళూరు బేస్డ్ ఏఐ ప్లాట్ ఫామ్ సర్వం AI ని ప్రపంచానికి పరిచయం చేశారు. అంతర్జాతీయ స్టాండర్డ్ తో పాటు స్వదేశీ పరిజ్ఞానం మరియు విలువలతో కూడిన వివరాలతో ఈ కొత్త ఏఐ మోడల్ ను విడుదల చేయడం హర్షించదగిన విషయంగా చూడవచ్చు. ఈ కొత్త ఇండియన్ ఏఐ ను రెండు మోడలో అందించింది.

Sarvam AI: ఏమిటి ఇది?

సర్వం ఏఐ అనేది పూర్తిగా స్వదేశీ ఏఐ మోడల్ మరియు ఇప్పుడు ఇది అందరికీ అందుబాటులోకి. ఈ కొత్త సర్వం ఏఐ మోడల్ ని 2024 సంవత్సరంలో డాక్టర్ వివేక్ రఘవన్ మరియు డాక్టర్ ప్రత్యుష్ కుమార్ స్థాపించారు. వీరిద్దరూ కూడా భారతీయ భాషల్లో ఏఐ పరిశోధనకు అంకితమైన ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్, AI 4 భారత్ (AI4Bharat) సంస్థలో పని చేసిన అనుభవజ్ఞులు. వీరిద్దరూ ఈ కొత్త ఏఐ మోడల్ ను దేశ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు మరియు ఇది ఇండియన్ స్టార్టప్ గా వచ్చింది.

Sarvam AI: ప్రత్యేకత ఏమిటి?

ఇది భారతీయ భాషలకు పెద్దపీట వేస్తూ నిర్మించబడిన లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (LLMs). ఇది భారతదేశ సంస్కృతి మరియు మూలలు అర్థం చేసుకునేలా నిర్మించబడింది. ఇందులో టెక్స్ట్ టు స్పీచ్, స్పీచ్ టు టెక్స్ట్, ట్రాన్స్లేట్, విజన్ మరియు చాట్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో స్పీచ్ కోసం మంచి వాయిస్ మోడల్స్ కొద అందించడం విశేషం. అంటే, మీరు ఏదైనా టెక్స్ లేదా సైట్ ను అందిస్తే ఆ మొత్తం కథనాన్ని మీకు నచ్చిన భాషలో వినిపిస్తుంది. అది కూడా మీరు కోరుకునే వాయిస్ లో మీరు వినే అవకాశం ఇస్తుంది.

అంతేకాదు, ఈ ఈ దేశీయ ఏఐ టూల్ తో ఏదైనా వాయిస్ రికార్డ్ లేదా లైవ్ వాయిస్ ఇచ్చినా కూడా రియల్ టైం లో టెక్స్ట్ రూపంలో మీకు అందిస్తుంది. ఇదే కాదు, ఇందులో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ లేదా మీరు కోరుకునే వివరాలు అందుకోవడానికి చాట్ ఆప్షన్ ఉంది. చాట్ ఆప్షన్ లోకి వెళ్లి మీరు కోరుకునే వివరాలు బాక్స్ లో రాసి ఇస్తే మీకు వెంటనే వివరాలు ఇన్స్టాంట్ గా అందిస్తుంది.

ఇది మీరు ఇప్పటికే ఉపయోగిస్తున్న ChatGPT మరియు గూగుల్ Gemini మాదిరిగా ఉంటుంది. అయితే, ఇది భారతీయ సంస్కృతి మరియు వాడుక బాష, లోకల్ వివరాలతో మమేకమై పూర్తిగా దేశీయ స్థితిలో వివరాలు అందిస్తుంది. ముఖ్యంగా, ఇందులో వాయిస్ మోడల్ లో ఉచ్చారణ చాలా చక్కగా ఉంది. ఇది ప్రపంచ స్టైల్ సిస్టమ్స్ మాదిరిగా కాకుండా భారతీయ భాషలు మరియు సంస్కృతికి అద్దం పట్టేలా డిజైన్ చేయబడింది.

ఇది 11 కంటే ఎక్కువ భాషల్లో స్పీచ్ టు టెక్స్ట్ మరియు టెక్స్ట్ టు స్పీచ్ లకు సపోర్ట్ చేస్తుంది. ఈ ఏఐ మోడల్ లో Bulbul V3 మరియు Bulbul V2 రెండు వెర్షన్లు ఉన్నాయి. ఇందులో చాలా సహజమైన ఉచ్చారణతో వాయిస్ మీకు లభిస్తుంది.

Also Read: Samsung Galaxy F70e 5G: బిగ్ బ్యాటరీ తో బడ్జెట్ 5G ఫోన్ గా లాంచ్ అయ్యింది.!

ప్రైస్

ఈ మోడల్ యొక్క Pro వెర్షన్ ను ఉచితంగా అందిస్తోంది. ఈ మెయిల్ ఐడి తో లాగిన్ అవ్వాలి. ఇందులో లాగిన్ అయిన వెంటనే 1000 క్రెడిట్స్ ఉచితంగా మీ అకౌంట్లో క్రెడిట్ చేస్తుంది. అయితే, బిజినెస్ ప్లాన్ యాక్సెస్ కోసం మాత్రం డబ్బు చెల్లించాలి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :