Aarogya Setu యాప్ లో తప్పులు కనిపెడితే రూ.4 లక్షల బహుమతి

Updated on 31-May-2020
HIGHLIGHTS

ఆరోగ్య సేతులో ఉన్న దోషాలను కనుగొనడంలో సహాయపడవచ్చు

వారికీ పారితోషికంగా రూ .4 లక్షలు రూపాయలు కూడా అఫర్ చేస్తోంది.

మీరు హ్యాకర్ లేదా యాప్స్ కి సంబంధించి కోడింగ్ తెలిసిన వారు కనుక అయితే, భారతదేశం యొక్క స్వంత కాంటాక్ట్-ట్రేసింగ్ యాప్  ఆరోగ్య సేతులో ఉన్న దోషాలను కనుగొనడంలో సహాయపడవచ్చు. ప్రభుత్వం ప్రచురించిన ఒక ట్వీట్‌లో, యాప్స్ కు సంబంధించి సాంకేతిక పరిజ్ఞానం ఉన్న పరిశోధకులు మరియు నిపుణులు ఎవరైతే ఆరోగ్య సేతులో వున్న దోషాలు మరియు సమస్యలను కనుగొనడంలో సహాయపడతారో వారికీ పారితోషికంగా రూ .4 లక్షలు రూపాయలు కూడా అఫర్ చేస్తోంది. "ఆరోగ్య సేతు యొక్క పరిశోధకులు మరియు వినియోగదారులతో సహా ప్రతి ఒక్కరూ ఆరోగ్య సేతు అప్లికేషన్ యొక్క ప్రైవసీ మరియు సమాచార భద్రతా వ్యవస్థను ప్రభావితం చేసే ఏవైనా హానికలిగించే రిపోర్ట్ చెయ్యమని "  ప్రభుత్వం చెబుతోంది.

కొన్ని వారాల క్రితం, ఫ్రెంచ్ సెక్యూరిటీ పరిశోధకుడు రాబర్ట్ బాప్టిస్ట్ ఇలియట్ ఆల్డెర్సన్ (టీవీ షో మిస్టర్ రోబోట్ నుండి వచ్చిన పాత్ర) అనే మారుపేరుతో చెప్పుకొచ్చారు. ఆరోగ్య సేతులో కొన్ని లోపాలు ఉన్నాయని, ఈ యాప్ సేకరించిన సమాచారం లీక్ కావడానికి దారితీస్తుందని ఒక ట్వీట్ పోస్ట్ చేశారు. ఈ విధంగా ఆయన చెప్పిన తరువాత, ఆరోగ్య సేతును ఓపెన్ సోర్సుగా మార్చాలని ప్రభుత్వం ఇప్పుడు నిర్ణయించింది. దీని అర్థం, ఎవరైనా ఇప్పుడు ఈ యాప్ కోసం సోర్స్ కోడ్‌ను పరిశీలించి తనిఖీ చేయవచ్చు మరియు వారు తగిన చోట అవసరమైన మార్పులు చేయవచ్చు. ప్రజల నుండి  ప్రతికూలత మరింత తీవ్రమవుతున్నందున ఇది ప్రభుత్వానికి అవసరమైన చర్యగా చూడవచ్చు.

ఈ యాప్ లో దోషాలను కనుగొన్న పరిశోధకులు అటువంటి హాని కలిగించే వాటిని బాధ్యతాయుతంగా బహిర్గతం చేయమని మరియు దాని కోసం తగిన పారితోషకాన్ని కూడా అందుకోవచ్చని, ప్రభుత్వం చెబుతోంది. ప్రజలు పాటించాల్సిన కొన్ని మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం నిర్దేశించింది. సాధారణంగా, నివేదించబడిన దోషాలు ఆరోగ్య సేతు యాప్ లేదా దాని సోర్స్ కోడ్ లేదా బ్యాక్ ఎండ్ సర్వర్‌లో మాత్రమే ఉండాలి. బగ్ లేదా దోషాలు "ఆరోగ్యా సేతు మద్దతు ఉన్న ఆండ్రాయిడ్ వెర్షన్‌ను నడుపుతున్న అన్‌రూట్ చేయని ఫోన్, ఎడిబి డిసేబుల్డ్ మరియు అన్ని డిఫాల్ట్ ఆండ్రాయిడ్ భద్రతా లక్షణాలతో" దోపిడీ చేయగలదని వారు తెలిపారు.

ఇతర ఆర్యోగ్య సేతు వార్తల విషయానికి వస్తే, విమాన ప్రయాణికులకు ఇప్పుడు ఈ యాప్ తప్పనిసరి. గూగుల్ మరియు ఆపిల్ యొక్క UPI పై ఆధారపడిన స్విస్ కోవిడ్ అనే కొత్త కాంటాక్ట్-ట్రేసింగ్ యాప్ కూడా ఉంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :