మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ లో మూడుస్థానాలు పైకి ఎగబాకిన భారత్..!!

Updated on 20-Jun-2022
HIGHLIGHTS

Ookla ఈరోజు మే 2022 నెల యొక్క స్పీడ్‌టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్‌ అప్‌డేట్‌ను విడుదల చేసింది

మొబైల్ డౌన్ లోడ్ స్పీడ్ లో భారత్ మూడుస్థానాలు పైకి ఎగబాకినట్లు ఈ ఇండెక్స్ ప్రకటించింది

భారతదేశం తన గ్లోబల్ ర్యాంకింగ్‌ను కూడా మెరుగుపరుచుకుంది

నెట్‌వర్క్ ఇంటెలిజెన్స్ మరియు కనెక్టివిటీ విభాగంలో గ్లోబల్ లీడర్ ఐన Ookla ఈరోజు మే 2022 నెల యొక్క స్పీడ్‌టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్‌ అప్‌డేట్‌ను విడుదల చేసింది. మొబైల్ డౌన్ లోడ్ స్పీడ్ లో భారత్ మూడుస్థానాలు పైకి ఎగబాకినట్లు ఈ ఇండెక్స్ ప్రకటించింది. అయితే, ఫిక్సెడ్ బ్రాండ్ బ్యాండ్ మీడియన్ డౌన్ లోడ్ స్పీడ్ స్వల్పంగా తగ్గినట్లు ఈ Ookla స్పీడ్‌టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్‌ సూచిందింది.

ఒక వివరాల్లోకి వెళితే, Ookla  స్పీడ్‌టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్‌ మే 2022 అప్‌డేట్‌ ప్రకారం, మే నెలలో భారత్ 14.28 Mbps మధ్యస్థ మొబైల్ డౌన్‌లోడ్ స్పీడ్‌ లను నమోదు చేసింది. అంతేకాదు, ఇది ఏప్రిల్ 2022 లో నమోదు చేసిన 14.19 Mbps కంటే కొంచెం మెరుగ్గా ఉంది. దీనికి అనుగుణం గానే మొబైల్ డౌన్ లోడ్ స్పీడ్ లో ఇండియా గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడు స్థానాలు ఎగబాకి 115వ స్థానంలో నిలిచింది.

ఇది మాత్రమే కాదు టోటల్ ఫిక్స్‌డ్ మీడియన్ డౌన్‌లోడ్ స్పీడ్ లో కూడా భారతదేశం తన గ్లోబల్ ర్యాంకింగ్‌ను కూడా మెరుగుపరుచుకుంది మరియు ఏప్రిల్‌ నెలలో  76వ స్థానం నిలువగా మే 2022 లో 75వ స్థానానికి చేరుకుంది. అయితే, ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్‌లో మధ్యస్థ డౌన్‌లోడ్ వేగంలో భారతదేశం యొక్క పనితీరు ఏప్రిల్ 2022 లో 48.09 Mbps ఉండగా మే 2022లో 47.86 కి స్వల్పంగా తగ్గింది.

స్పీడ్‌టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్‌ మే 2022 ప్రకారం, నార్వే మరియు సింగపూర్ రెండు దేశాలు గ్లోబల్ మొబైల్ స్పీడ్ మరియు ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్‌ లలో అగ్రస్థానాల్లో నిలిచాయి. ఇవి మధ్యస్థ డౌన్‌లోడ్ వేగం వరుసగా 129.40 Mbps మరియు 209.21 Mbps లను నమోదు చేశాయి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :