Idea ఈ ప్లాన్ లో 70GB డేటా అండ్ అన్లిమిటెడ్ కాలింగ్

Updated on 06-Nov-2017

ఐడియా దాని వినియోగదారులకు ఒక కొత్త ప్లాన్ ను ప్రవేశపెట్టింది. ఈ ఐడియా ప్లాన్ 398 రూపాయల ధరకే ఉంది. ఈ ప్లాన్లో 70GB డేటా మరియు అపరిమిత  కాలింగ్  వినియోగదారులకు ఇవ్వబడుతున్నాయి. ఈ ప్రణాళిక గురించి తెలుసుకోండి.ఐడియా సెల్యూలార్ మరోసారి తన  ప్లాన్స్  ని  అప్డేట్ చేసింది . కంపెనీ యొక్క 398  ప్లాన్  వివిధ  సర్కిల్స్ లో  ప్రవేశపెట్టబడింది, దాని  వాలిడిటీ కూడా భిన్నంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఈ ప్లాన్  యొక్క  వాలిడిటీ 56 రోజులు, రెండవ సర్కిల్లో ఈ ప్లాన్  70 రోజుల  వాలిడిటీ తో వస్తుంది. సర్కిల్ ప్రకారం, రూ. 398 ఈ ప్లాన్ లో ప్రతిరోజూ 1GB 3G / 4G డేటాను పొందుతారు.ఐడియా రూ. 398 ఈ ప్లాన్ అన్ని నెట్వర్కుల్లో అపరిమిత కాలింగ్ సదుపాయాన్ని అందిస్తుంది. అయితే, మిగతా  ప్లాన్ ల లాగా, 398 రూపాయల ఈ ప్లాన్ వినియోగదారుల కు ఫ్రీ sms ప్రయోజనం కలిగించదు. అదనంగా, ఐడియా   నుంచి ఇంకొక  349 రూ. ప్లాన్ ఉంది,  దీనిలో  28 GB డేటా మరియు అపరిమిత కాలింగ్స్ 28 రోజుల  వాలిడిటీ తో అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్లో ప్రతిరోజూ 100 SMS  లను ఫ్రీ గా  వినియోగదారులు పొందుతారు.

 

 

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :