LPG కస్టమర్లకు మంచి అఫర్ అందుబాటులో ఉందని తెలుసా?

Updated on 31-Dec-2020
HIGHLIGHTS

LPG గ్యాస్ సిలిండర్ ను చాల తక్కువ రేటుకే కొనుగోలు చేయవచ్చు.

LPG సిలిండర్ కేవలం 246 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు.

Paytm ద్వారా గ్యాస్ బుకింగ్ చేసుకునే వారికీ ఈ అఫర్ ఇస్తోంది

మీరు LPG కస్టమర్ ఆయితే మీకు మంచి అఫర్ అందుబాటులో ఉందని తెలుసా? ఈ అఫర్ ద్వారా మీరు కొనుగోలు చేసే LPG గ్యాస్ సిలిండర్ ను చాల తక్కువ రేటుకే కొనుగోలు చేయవచ్చు. ఎంత తక్కువంటే 746 రూపాయలు వున్నా LPG సిలిండర్ కేవలం 246 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు. అయితే,  ఈ అఫర్ తో మీ గ్యాస్ సిలిండర్ ను ఎలా బుక్ చెయ్యాలి? దీనికి సంభందించి ఎటువంటి షరతులు వర్తిస్తాయి అనే అన్ని విషయాలను ఇక్కడ తెలుసుకోండి.                   

ఆన్లైన్ చెల్లింపు సంస్థ అయిన Paytm ద్వారా గ్యాస్ బుకింగ్ చేసుకునే వారికీ ఈ అఫర్ ఇస్తోంది. అయితే, Paytm ద్వారా గ్యాస్ బుకింగ్ చేసుకునే Indane Gas మరియు Bharat Gas వినియోగదారుల LPG Gas బుకింగ్ పైన మాత్రమే ఈ 500 రూపాయల క్యాష్ బ్యాక్ అఫర్ లభిస్తుంది. అయితే, ఈ క్యాష్ బ్యాక్ అఫర్ ను మీరు పొందాలంటే కొన్ని స్టెప్స్ అనుసరించాలి మరియు Paytm కొన్ని నిబంధనలను కూడా విధించింది. అవేమిటో పరిశీలిద్దాం…

Paytm నుండి క్యాష్ బ్యాక్ అఫర్ తో గ్యాస్ బుకింగ్

Paytm యొక్క ఈ  LPG Gas బుకింగ్ క్యాష్ అఫర్ ను పొందాలంటే ముందుగా మీ వద్ద Paytm యాప్ ఉండాలి

మీ ఫోనులోని Paytm యాప్ లో రీఛార్జ్ & బిల్ పే అప్షన్ కు వెళ్ళాలి

ఇక్కడ మీరు LPG Cylinder Booking ఎంపికను చూడవచ్చు

ఇందులో మీరు LPG Gas Book పైన నొక్కిన వెంటనే మీకు కావాల్సిన గ్యాస్ కనెక్షన్ ఎంచుకోవాలి

ఇక్కడ  HP, Indane మరియు Bharat గ్యాస్ నుండి మీ అప్షన్ ఎంచుకోవచ్చు

మీ గ్యాస్ ప్రొవైడర్ ను ఎంచుకున్న తరువాత, మీ రిజిస్టర్ మొబైల్ లేదా LPG ID ని నమోదు చెయ్యాలి

ఇక్కడ మీ గ్యాస్ ఏజన్సీ, LPG కన్జ్యూమర్ నంబర్ మరియు మీ గ్యాస్ యొక్క ఇతర సమాచారాన్ని చూడవచు

చివరిగా, మీ గ్యాస్ బుకింగ్ కోసం యెంత డబ్బును చెల్లించాలో ఇక్కడ చూడవచ్చు

అయితే, ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ అఫర్ డిసెంబర్ 31 వరకూ మాత్రమే చెల్లుతుంది.

బుకింగ్ పైన Paytm విధించిన షరతులు

Paytm పైన LPG Gas బుకింగ్ పైన క్యాష్ బ్యాక్ అఫర్ పైన విధించిన షరతులను ఈ క్రింద చూడవచ్చు.

Paytm ద్వారా మొదటి సారి LPG Gas బుకింగ్ చేసుకునే LPG కస్టమర్లకు మాత్రమే ఈ అఫర్ వర్తిస్తుంది.

అఫర్ కోసం Promo Code విభాగంలో FIRST LPG కోడ్ ఎంటర్ చెయ్యాలి.

ఈ అఫర్ కేవలం Promo Code ఎంటర్ చేసిన వారికీ మాత్రమే ఇవ్వబడుతుంది

ఒకవేళ మీరు Promo Code ఎంటర్ చేయక పొతే మీకు అఫర్ వర్తించదు

ఈ అఫర్ కేవలం ఒక్కసారి వర్తిస్తుంది, మొదటిసారి బుకింగ్ పైన మాత్రమే.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :