ఆధార్ కార్డ్: ఒరిజినల్ అవునా కాదా ఎలా చెక్ చెయ్యాలి..!

Updated on 12-Jan-2022

ప్రస్తుతం మనదేశంలో దాదాపుగా అన్ని ముఖ్యమైన పనులకు కూడా ఉపయోగించేది ఆధార్ కార్డ్. అయితే, ఈ ఆధార్ కార్డు కనుక నీకిలిదైతే ఏమిచేయాలి. ఆధార్ కార్డ్ నకిలీది ఏమిటా అనుకోకండి, =మీరు విన్నది నిజమే ఇందులో ఎటువంటి సందేహం లేదు. ప్రభత్వం ఇచ్చిన ఆధార్ కార్డులు ఖచ్చితంగా నిజమైనవే. కానీ, అక్కడక్కడా కొన్ని నకిలీ ఆధార్ కార్దులు కూడా ఉన్నట్లు చాలా సార్లు వార్తల్లో చూస్తుంటాము.

మరి, వాటిలో మీ ఆధార్ కూడా ఉందని డౌటు రావచ్చు. అందుకే, ఎటువంటి ఆ అనుమానాలకు తావివ్వకుండా ఎవరి ఆధార్ కార్డు అయినా సరే నిజమైనదా లేక నకిలీదా అని చెక్ చేకునేనుందుకు ప్రభుత్వం సరైన మార్గాన్ని కూడా అందించింది. ఈ మార్గం ద్వారా మీరు కూడా మీ ఆధార్ కార్డు ని చెక్ చేసుకోవచ్చు. మరి అది ఎలాగ చేయాలో ఇక్కడ తెలుసుకుందాం…!       

మీ ఆధార్ నిజమైనదా లేక నకిలీదా?  అని ఎలా చెక్ చేయాలి ?

దీని కోసం, ముందుగా మీరు www.uidai.gov.in కు వెళ్ళాలి. అయితే, ఇక్కడ నుండి చాలా ఇతర విభగాలకు వెళ్ళవలసి వుంటుంది. అందుకే, మీరు నేరుగా మైన్ పేజ్ వెబ్‌సైట్‌ కు వెళ్లాలనుకుంటే https://resident.uidai.gov.in/verify కు వెళ్లాలి. ఇక్కడ మీరు మీ ఆధార్ ని సరైనదా కాదా అని ధృవీకరించడానికి, Aadhaar Number అని సూచించిన వద్ద మీ ఆధార్ నంబర్ ను ఎంటర్ చేయాలి. తరువాత, క్రింద అడగబడిన Captcha Verification ని కూడా ఎంటర్ చేసి Proceed To Verify పైన నొక్కాలి.

తరువాత, మీకు మీ ఆధార్ గురించి వివరాలు అందించబడతాయి. ఇందులో, మీరు ఎంటర్ చేసిన ఆధార్ సరైనదైతే, ఇందులో Age Group,జెండర్, రాష్ట్రం మరియు రిజిస్టర్ మొబైల్ నంబర్ చివరి మూడు అంకెలు వంటి వివరాలు చూపించ బడతాయి. ఇలాగ, మీ ఆధార్ నిజమైనదా లేక నకిలీదా అనే దాని పైన క్లారిటీ వస్తుంది.   

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :