మీరు ఎక్కడికి వెళ్లినా Google మిమ్మల్ని గమనిస్తూనే ఉంటుందని మీకు తెలుసా? మీరు వెళ్లిన ప్రాంతం వెళ్లారు, మీరు ఎప్పుడు ఏమి సెర్చ్ చేస్తున్నారు అనే విషయాలు కూడా గూగుల్ కి తెలుసు. అయితే, కావాలని ఈ విషయాలను గూగుల్ సేకరించదు. వాస్తవానికి, మీ లొకేషన్ ఆధారంగా రియల్ టైం ట్రాఫిక్, ఫోటోలు, Search మరియు మరికొన్ని ఇతర అవసరమైన వాటిని గురించి ఖచ్చితమైన సమాచారాన్ని మీకు అందించడానికి గూగుల్ తన లొకేషన్ సర్వీస్ ను మరింతగా ఇంప్రూవ్ చెయ్యడానికి ఈ విధంగా చేస్తుంది.
అయితే, ఒకవేళ Google మీ లొకేషన్ ను ట్రాక్ చెయ్యకూడదు అని మీరు అనుకుంటే మాత్రం దాన్ని బ్లాక్ చెయ్యవచ్చు. ఈ విధంగా చెయ్యడానికి మీకు అవసరమైన స్టెప్స్, ట్రిక్స్ మరియు టిప్స్ ను ఈ క్రింద చూడవచ్చు.
లొకేషన్ ట్రాకింగ్ ను బ్లాక్ చెయ్యడానికి రెండు పద్దతులను మనం అవలంభించవచ్చు. కానీ ఒక పద్ధతి ద్వారా సులభంగా కేవలం ఒక్క స్వైప్ తో మీ గూగుల్ లొకేషన్ డేటా సేకరణను బ్లాక్ చెయ్యవచ్చు. అందుకే, రెండు పద్దతులను కూడా పరిశీలిద్దాం.
ఈ విధానంలో, మీరు మీ స్మార్ట్ ఫోన్ లోని అన్ని యాప్స్ యొక్క లొకేషన్ డేటాని బ్లాక్ చెయ్యవలసి వుంటుంది. ఇందుకోసం, మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ సెట్టింగులకు వెళ్లి Location ను ఎంచుకొని అందులో Location Access బటన్ ను 'Off' చెయ్యండి.
ఇది కూడా పైన తెలిపిన విధంగానే వుంటుంది. ఇందులో కూడా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ సెట్టింగులకు వెళ్లి Location ను ఎంచుకొని అందులో Google Location History లోకి వెళ్ళాలి. ఇక్కడ మీ గూగుల్ అకౌంట్స్ అడగబడతాయి. మీ ఫోనులో ఒకటి కంటే ఎక్కువ అకౌంట్స్ ను ఉపయోగించినట్లయితే మాత్రమే ఈ స్టప్ మీకు అవసరమవుతుందని గమనించండి. ఇక్కడ మీకు Activity Control లో Location History కనిపిస్తుంది. దాని ప్రక్కన వుండే టోగుల్ బటన్ ను ఎడమకు తిప్పాలి లేదా ఆఫ్ చెయ్యాలి.
అంతే, ఇలా చేస్తే మీ లొకేషన్ డేటాని Google సేకరించే అవకాశం ఉండదు. అయితే, రియల్ టైం ట్రాఫిక్ మరియు మరిన్ని పర్సనలైజ్డ్ గూగుల్ సర్వీస్ లను అందుకునే అవకాశాన్ని మీరు కోల్పోతారు.