ఒకప్పుడు CCTV అంటే గొప్ప విషయం, బ్యాంకులు లేదా పెద్ద సంస్థలు మాత్రం వాటి సెక్యూరిటీని పటిష్టంగా ఉంచడానికి CCTV టెక్నలాజిని ఉపయోగించేవి. అయితే, ఇప్పుడు కాలం మారింది. ఇప్పుడు చిన్న చిన్న షాపులు మొదలుకొని, ఇళ్లకు కూడా CCTV లు పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. నానాటికి పెరుగుతున్న నేరాలు, తక్కువ ధరకే CCTV సౌకర్యం అందుబాటులోకి రావడం వంటి కారణాలతో ఇది ప్రతి ఒకరి అవసరంగా మారింది. అయితే, ఇక్క రూపాయి ఖర్చులేకుండా మీ ఇంటికి CCTV ని సెట్ చేసుకోవడానికి ఒక సులువువైన మార్గం ఉంది. ఈరోజు మనము ఆ సులువైన మార్గం గురించి చూద్దాం….
కొన్ని వస్తువులు మనకు జ్ఞాపకాలుగా గుర్తుండి పోతాయి, వాటిని మనం అమ్మడం లేదా ఎవరికైనా ఇవ్వడం వంటివి చెయ్యలేము. అటువంటి వాటిలో, మొబైల్ లేదా స్మార్ట్ ఫోన్లు కూడా ఉంటాయి. అందుకే, మీ ఇంటి బీరువాలో అలా జ్ఞాపకంగా మూలన పడి బూజు పట్టిన పాత ఫోన్లను మీ ఇంటి CCTV లాగా ఎలా మార్చుకోవాలో అని ఈరోజు చెప్పబోతున్నాను. స్టెప్ బై స్టెప్ సవివరంగా తెలుసుకోండి.
మీకు ఎటువంటి అధనపు ఖర్చు లేకుండానే మీ ఇంటిని రక్షించడంలో వాటిని ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు, మీరు వాడుతున్న ఫోన్ను బేబీ మానిటర్ గా కూడా ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, మీరు దీన్ని తాత్కాలిక Google హోమ్ స్పీకర్ గా కూడా ఉపయోగించవచ్చు.
వాస్తవినికి, ఇలాంటివి మంచి ఆలోచనలు, వీటిని ఉపయోగించి మీరు మీ పాత ఫోన్ కు కొత్త రూపాన్ని ఇవ్వగలరు. ఏదేమైనా, మీ పాత ఫోన్ను మీ ఇంటి సెక్యూరిటీ కెమెరాగా ఉపయోగించవచ్చనేది ఒక ఉత్తమమైన ఆలోచనగా ఉంటుంది.
ముందుగా, మీరు మీ పాత ఫోన్ లో సెక్యూరిటీ కెమెరా యాప్ ని ఎంచుకోవాలి. ఇలాంటి సౌకర్యంతో చాలా యాప్స్ Google store లో చాలానే ఉన్నాయి. మీరు లోకల్ స్ట్రీమింగ్, క్లౌడ్ స్ట్రీమింగ్, రికార్డింగ్ ను పొందినట్లే, ఫుటేజీని రిమోట్‌గా లేదా స్థానికంగా స్టోరేజి చేసే సదుపాయం కూడా ఇందులో ఉంటుంది. ఇది కాకుండా, మీరు మోషన్ డిటెక్షన్ మరియు హెచ్చరికలను కూడా పొందేవీలుంది.
సెటప్ చేసిన తర్వాత, మీరు మీ ఇంటిలో లేదా ఎక్కడి నుండైనా సెక్యూరిటీ కెమెరాను నియంత్రించవచ్చు. మీరు దీన్ని మీ క్రొత్త ఫోన్ ద్వారా చేయవచ్చు. మీ ఫోన్‌ను సెక్యూరిటీ కెమెరా చేసుకోవడానికి Alfred యాప్ ఉపయోగించడం ఉత్తమ మార్గం. ఇది క్రాస్ ప్లాట్‌ఫాం, అంటే మీ పాత ఫోన్ ఆండ్రాయిడ్ ఫోన్ కాదా లేదా ఇది iOS ఆధారిత ఆపిల్ ఐఫోన్ కాదా అన్నది పట్టింపు లేదు. మీరు మీ క్రొత్త ఫోన్‌తో కూడా అదే చేయవచ్చు.
ఈ ALfred ఉచితం, మరియు మీకు ప్రత్యక్ష ఫీడ్ యొక్క రిమోట్ వ్యూ ను అందిస్తుంది, అంతేకాకుండా మీకు చలన గుర్తింపు లభిస్తుంది. ఇది కాకుండా మీరు హెచ్చరికలను కూడా పొందుతారు. మీకు ఇందులో ఉచిత క్లౌడ్ స్టోరేజి లభిస్తుంది. దీనితో పాటు, మీకు టూ-వే ఆడియో ఫీడ్ కూడా లభిస్తుంది. ఎందుకంటే ఇది ముందు మరియు వెనుక కెమెరా ద్వారా మీకు సమాచారం ఇస్తుంది.
మీరు Android లేదా iOS స్టోర్ కి వెళ్లి Alfred యాప్ ని మీ క్రొత్త మరియు పాత ఫోన్‌లలో డౌన్లోడ్ చేయాలి. మీరు మీ క్రొత్త మరియు పాత టాబ్లెట్‌తో కూడా చేయవచ్చు. అంటే, మీ రెండు ఫోన్‌లలోనూ ఈ యాప్ ని డౌన్‌లోడ్ చేయండి.
దీని తరువాత, మీరు స్టార్ట్ బటన్‌ను చూస్తారు, దానిపై క్లిక్ చేసిన తర్వాత, మీరు ముందుకు వెళతారు, అప్పుడు మీరు వ్యూయర్ ని పొందబోతున్నారు, దాన్ని ఎంచుకుని ముందుకు సాగండి.
ఇప్పుడు ఇక్కడ సైన్ ఇన్ చేయమని అడుగుతారు, మీరు మీ Google ఖాతాతో సైన్ ఇన్ చేయవచ్చు. మీకు ఇక్కడ Google ఖాతా అవసరం.
మీరు మీ పాత ఫోన్‌లో కూడా ఇలాంటిదే చేయాల్సి ఉంటుంది, అయితే పాత ఫోన్‌లో మీరు వ్యూవర్ కి బదులుగా కెమెరాను ఎంచుకోవాలి. దీని తరువాత మీరు రెండు ఫోన్‌లలో ఒకే ఖాతాకు సైన్ ఇన్ అయ్యారని నిర్ధారించుకోవాలి.
ఇప్పుడు మీ సెటప్ పూర్తయింది, ఇప్పుడు మీరు మీ ఫోన్‌ను మీ ఇంట్లో సరైన స్థలంలో ఉంచాలి, ఆ తర్వాత మీరు మీ ఇతర ఫోన్ ఒక సెక్యూరిటీ కెమేరాగా మీకు లైవ్ ఫీడ్ అందిస్తుంది.