how to remove or deactivate a deceased person's Aadhaar from the UIDAI
Aadhar Card దేశంలో అత్యున్నత ఐడెంటిటీ పత్రంగా చెల్లుబాటు అవుతుంది. అటువంటి ఆధార్ కార్డు కలిగిన వ్యక్తి చనిపోతే ఆధార్ కార్డు ను వెంటనే తొలగించడం మంచిది. ఎందుకంటే, మృతుల ఆధార్ కార్డ్ తప్పుగా ఉపయోగించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ చర్య ఉత్తమంగా ఉంటుంది. ఇప్పటి వరకు గడిచిన 14 సంవత్సరాలలో UIDAI తన డేటా బేస్ నుంచి 1.17 కోట్ల మృతుల ఆధార్ కార్డు లను డియాక్టివేట్ చేసింది. అంతేకాదు, మృతుల ఆధార్ కార్డ్ లను తొలగించడానికి UIDAI మరింత విస్తృతంగా పని చేస్తోంది. ఇటీవల అందించిన ఈ కొత్త న్యూస్ తో చాలా మంది యూజర్లు మృతుల Aadhar Card ను ఆన్లైన్ లో తొలగించే అవకాశం ఫ్యామిలీ సభ్యులకు ఉంటుందా? అనే ప్రశ్న ఎక్కువగా ఆన్లైన్ లో సెర్చ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయాలు ఈరోజు చూద్దాం.
మృతుల Aadhar Card ను ఆన్లైన్ లో తొలగించే అవకాశం ఫ్యామిలీ సభ్యులకు ఉంటుందా? అని మీకు డౌట్ వస్తే, దీనికోసం UIDAI ఇచ్చే సమాధానం, ‘లేదు’ అని మాత్రమే. ఎందుకంటే, మృతుల ఆధార్ కార్డ్ ను యూజర్ కుటుంబ సభ్యులు నేరుగా డియాక్టివేట్ చేసే ఆన్లైన్ ప్రోసెస్ ను UIDAI ఇప్పటి వరకు అందించలేదు. అంటే, సెల్ఫీ సర్వీస్ పోర్టల్ నుంచి మృతుల ఆధార్ డియాక్టివేట్ చేయడం కుదరని పని.
అయితే, మృతుల ఆధార్ కార్డ్ ను డియాక్టివేట్ చేయడానికి మన తెలుగు రాష్ట్రాల్లో మృతుల ఆధార్‌ను తొలగించడానికి అనువైన లింక్ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో మొదటిది జనన మరియు మరణ నమోదు కార్యాలయంలో తెలియజేయడం. అంటే, మునిసిపల్ లేదా మరణాల రిజిస్ట్రేషన్ కార్యాలయంలో నమోదు చేసుకోవచ్చు. దీనికోసం మృతుని ఆధార్ నెంబర్ ను అప్లికేషన్ లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా అధికారుల ద్వారా UIDAI కి ఈ సమాచారం చేరుతుంది.
ప్రస్తుతం, ఈ అవకాశం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర మరియు ఢిల్లీ (కొన్ని భాగాల్లో) మాత్రమే ఉంది. ఇలా చేయడం ద్వారా మొబైల్, పింఛన్, బ్యాంకులు, సబ్‌సిడీలు వంటి సేవల నుంచి ఆ ఆధార్ డీలింక్ చేయబడుతుంది. దీనికోసం మరణ ధృవీకరణ పత్రం కాపీ, కుటుంబ సభ్యుల ఐడెంటిటీ ప్రూఫ్ (నామినీ/లీగల్ వారసులు) మరియు మృతుడి ఆధార్ కార్డ్ కాపీ లను ఇవ్వవలసి ఉంటుంది.
Also Read: iQOO Z10R లాంచ్ కంటే ముందే ఫీచర్స్ మరియు అంచనా ధర తెలుసుకోండి.!
ఇంకేమైనా అదనపు సమాచారం కోరుకుంటే UIDAI హెల్ప్‌లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 1947, లేదా ఇమెయిల్ లేదా UIDAI అధికారిక సైట్ నుంచి సమాచారం పొందవచ్చు.