కొత్త Dial Pad నచ్చడం లేదా.. పాత డయల్ ప్యాడ్ ఇలా సెట్ చేసుకోండి.!

Updated on 23-Aug-2025
HIGHLIGHTS

మీ Dial Pad లో చాలా మార్పులు జరిగినట్లు మీరు చూడవచ్చు

ఇది ఎవరి ప్రమేయం లేకుండా పూర్తి ఆటోమేటిక్ గా జరిగిపోయింది

పాత డయలర్ ప్యాడ్ ని ఈజీగా మీ ఫోన్లో తిరిగి పొందవచ్చు

మీ స్మార్ట్ ఫోన్ లో మీరు ఎటువంటి అప్డేట్ చేయకుండానే మీ Dial Pad లో చాలా మార్పులు జరిగినట్లు చూసి కంగారు పడుతున్నారా? కంగారు పడకండి, ఇందులో మీరు చేసిన అప్డేట్ లేదా తప్పు ఏమీ లేదు. ఇలా జరగడానికి కారణం గూగుల్ కొత్తగా తీసుకొచ్చిన డయల్ ప్యాడ్ అప్డేట్ మాత్రమే అని అర్థం చేసుకోండి. ఇది ఎవరి ప్రమేయం లేకుండా పూర్తి ఆటోమేటిక్ గా జరిగిపోయింది. ఈ గూగుల్ కొత్తగా తెచ్చిన ఈ డయల్ ప్యాడ్ మీకు నచ్చితే వెల్ అండ్ గుడ్. ఒకవేళ గూగుల్ తెచ్చిన ఈ కొత్త డయల్ ప్యాడ్ మీకు నచ్చక పోయినట్లయితే మీరు చాలా కాలం ఉపయోగించిన అదే పాత డయలర్ ప్యాడ్ ని ఈజీగా మీ ఫోన్లో తిరిగి పొందవచ్చు.

Google కొత్త Dialer Pad ఏమిటి?

గూగుల్ రెండు రోజుల క్రితం ఈ కొత్త అప్డేట్ ను అందించింది మరియు ఈ కొత్త అప్డేట్ తో ఫోన్ లో చాలా కాలంగా మనం ఉపయోగిస్తున్న డయల్ ప్యాడ్ లేదా డయల్ ప్యాడ్ కొత్తగా మారిపోయింది. దీనికి కారణం ఫోన్ డయల్ ప్యాడ్ యాప్ లో గూగుల్ తెచ్చిన కొత్త యూజర్ ఇంటర్ఫేస్ అప్డేట్. ఈ కొత్త అప్డేట్ దాదాపు అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లకు వర్తిస్తుంది. కాబట్టి, అన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు కూడా ఈ కొత్త అప్డేట్ తో డయలర్ ప్యాడ్ కొత్తగా కనిపించడం జరిగింది.

ఈ కొత్త Dial Pad తో ఏదైనా సమస్య ఉంటుందా?

ఈ కొత్త డయల్ ప్యాడ్ తో ఏదైనా సమస్య ఉంటుందా? అని చాలా మంది యూజర్లు కంగారు పడుతున్నారు. అయితే, ఈ కొత్త అప్డేట్ తో ఎటువంటి సమస్య ఉండదు. జస్ట్ కొత్త ఫీచర్స్ మరియు కొత్త రూపంలో ఉంటుంది. అయితే, ఈ కొత్త దానికి అలవాటు పడితే అంతా బాగానే ఉంటుంది. ఒకవేళ అలా కాదు కొత్త డయల్ ప్యాడ్ కావాలనుకుంటే కూడా మార్చుకోవచ్చు.

Also Read: డిస్కౌంట్ ఆఫర్స్ తో రీజనబుల్ ధరలో లభిస్తున్న ONIDA 55 ఇంచ్ Smart Tv

పాత డయలర్ ప్యాడ్ ఎలా సెట్ చేసుకోవాలి?

మీ ఫోన్ లో పాత డయలర్ ప్యాడ్ ఇలా సెట్ చేసుకోవడం చాలా సులభం. దీనికోసం, మీ ఫోన్ లో ఉన్న పాత డయలర్ యాప్ బటన్ పై రెండు మూడు సెకన్లు నొక్కి పట్టుకోండి. ఇలా చేసే యాప్ ఇన్ఫో ఓపెన్ అవుతుంది. ఇక్కడ యాప్ ఇన్ఫో లో క్రింద “Force Stop” బటన్ కనిపిస్తుంది దానిపై నొక్కండి. తర్వాత పైన కనిపించే మూడు చుక్కల హ్యాంబర్గ్ పై నొక్కండి. ఇక్కడ నొక్కగానే ‘UnInstall Updates’ అని కొత్త బటన్ ఓపెన్ అవుతుంది. ఈ కొత్త బటన్ పై నొక్కగానే కొత్త అప్డేట్ తొలగిపోతుంది. ఇలా చేయగానే మీ ఫోన్ మళ్ళీ పాత డయల్ ప్యాడ్ తో దర్శనమిస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :