UPI Scams నుంచి మీ యూపీఐ యాప్స్ సురక్షితంగా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.!

Updated on 14-Nov-2025
HIGHLIGHTS

UPI Scams ఈ రోజుల్లో చాలా సాధారణమైన స్కామ్స్ గా మారిపోయాయి

ఆన్లైన్ లో చాలా సులభంగా పేమెంట్ చెల్లించే పద్ధతి వచ్చిన తర్వాత స్కామ్స్ చాలా వేగంగా పెరిగాయి

మీ ఫోన్ లో ఉన్న యూపీఐ యాప్స్ ని యూపీఐ స్కామ్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు

UPI Scams ఈ రోజుల్లో చాలా సాధారణమైన స్కామ్స్ గా మారిపోయాయి. ఆన్లైన్ లో చాలా సులభంగా పేమెంట్ చెల్లించే పద్ధతి వచ్చిన తర్వాత స్కామ్స్ చాలా వేగంగా పెరిగాయి. దేశంలో ప్రతిరోజు ఏదో ఒక మూలన ఈ స్కామ్ లకు ఎవరో ఒకరు బలవుతూనే ఉన్నారు. అయితే కొన్ని చిన్నపాటి జాగ్రత్తలు తీసుకునే మీ ఫోన్ లో ఉన్న యూపీఐ యాప్స్ ని యూపీఐ స్కామ్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు.

UPI Scams

భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల్లో UPI (Unified Payments Interface) అత్యంత ఉపయోగంలో ఉన్న పేమెంట్ ప్లాట్‌ఫార్మ్. అయితే, వేగంగా పెరిగిన యూజర్ల సంఖ్య పాటు కొత్త కొత్త స్కామ్‌లు మరియు ఫ్రాడ్ టెక్నిక్స్ కూడా పెరిగాయి. సైబర్ నేరగాళ్లు ఇప్పుడు పాత ఫిషింగ్ లింక్‌లు కంటే ఎక్కువగా సిమ్-స్వాపింగ్, స్క్రీన్ షేరింగ్, మిస్‌కాల్ స్కామ్స్, క్లోన్ యాప్స్, యూపీఐ కలెక్ట్ రిక్వెస్ట్ ఫ్రాడ్స్ మరియు QR కోడ్ రివర్స్ పే వంటి హై-టెక్ స్కామ్‌ పద్ధతులు ఉపయోగిస్తున్నారు. వీటి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.

QR కోడ్ రివర్స్ పే స్కామ్

ఇది ఇప్పుడు సర్వసాధారణంగా మరియు ఎక్కువగా జరుగుతున్న స్కామ్. ఇందుకు అమౌంట్ పొందడానికి లేదా ఈ కోడ్ స్కాన్ చేస్తే ఈ అకౌంట్ కి డబ్బు వస్తుందని చెబుతారు. కానీ పెద్ద స్కామ్ ఆ క్యుఆర్ కోడ్ స్కాన్ చేయగానే మీ అకౌంట్ నుంచి అమౌంట్ పంపబడుతుంది. నిజం ఏమిటంటే, ఏ QR కోడ్ స్కాన్ చేసినా మీరు డబ్బు పంపుతారు, పొందడం జరగదు.

యూపీఐ కలెక్ట్ రిక్వెస్ట్ ఫ్రాడ్స్

కొన్ని సందర్భాల్లో స్కామర్లు ‘యూపీఐ కలెక్ట్ రిక్వెస్ట్’ నోటిఫికేషన్ పంపిస్తారు. మీరు కనుక ఈ రిక్వెస్ట్ ని పొరపాటున కూడా అప్రూవ్ చేయకండి. ఒకవేళ మీరు ఈ రిక్వెస్ట్ అప్రూవ్ చేసారంటే మీ అకౌంట్ నుంచి డబ్బు సెండ్ అవుతుంది.

క్లోన్ యూపీఐ యాప్స్

ఆన్లైన్ ఏదైనా యూపీఐ యాప్ ని లేదా గూగుల్ ప్లే స్టోర్ మాదిరిగా కనిపించే ఫేక్ సైట్ నుంచి యూపీఐ యాప్స్ డౌన్ లోడ్ చేస్తే ఆ APK ఫైల్ మీ అకౌంట్ PIN, SMS మరియు కాంటాక్ట్ లను సైతం డౌన్లోడ్ చేసుకుంటుంది. దీనితో మీ అకౌంట్ దోచుకోవడమే కాకుండ మీ కాంటాక్ట్ లో ఉన్న వారికి పేమెంట్ రిక్వెస్ట్ పంపించే అవకాశం ఉంటుంది. కాబట్టి, అధికారిక యూపీఐ యాప్స్ ని మాత్రమే ఉపయోగించండి.

Also Read: BSNL రూ. 1 అన్లిమిటెడ్ 30 డేస్ ఆఫర్ రేపటితో క్లోజ్ అవుతుంది.. డోంట్ మిస్.!

స్క్రీన్-షేరింగ్ యాప్ తో మోసం

కస్టమర్ సపోర్ట్ పేరుతో కొందరు ఫోన్ లో AnyDesk / TeamViewer వంటి యాప్స్ ఇన్‌స్టాల్ చేస్తారు. ఇది స్క్రీన్-షేరింగ్ యాప్ మరియు ఇది మీ ఫోన్ యూపీఐ యాప్ వివరాలతో పాటు మీ యూపీఐ PIN తో సహా రికార్డ్ చేస్తారు. దీని మీ అకౌంట్ ఖాళీ చేయడమే కాకుండా మీ పర్సనల్ డేటా సైతం స్కామర్లు చేజిక్కించుకుంటారు.

అందుకే ఇలాంటి వాటితో జాగ్రత్తగా ఉండండి. మీరు మీ ఫోన్ యూపీఐ యాప్స్ తో సేఫ్టీ రూల్స్ ఫాలో అవ్వకపోతే మీరు చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది. మీరు ఎప్పుడు కూడా యూపీఐ పిన్ నెంబర్ ను షేర్ చేయకూడదు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :