మీ స్మార్ట్ ఫోన్ లో 4G ఇంటర్నెట్ స్పీడ్ మరింత వేగంగా మార్చుకోండి

Updated on 26-Mar-2020
HIGHLIGHTS

మీ ఫోన్లో 4G వేగం మెరుగుపరచడానికి ఈ పద్ధతులను ఉపయోగించవచ్చు.

ప్రస్తుతం ప్రపంచ ద్రుష్టి, రానున్న 5G మీద ఉంటే, మనదేశంలో మాత్రం చాలామంది మాత్రం, ప్రస్తుతం అందుబాటులోవున్న 4G  స్పీడ్ కూడా  సరిగ్గా  అందుకోలేకపోతున్నారు. భారతదేశంలో 4G నెట్వర్క్ గణనీయంగా విస్తరించింది మరియు ప్రతి ఒక్కరు కూడా ఈ సేవలవైపుకే మొగ్గుచూపుతున్నారు. అంతేకాదు, ప్రస్తుతం భారతదేశం అంతటా కొనసాగుతున్న 21 రోజుల లాక్ డౌన్ కారణంగా ఈ ఇంటర్నెట్ వినియోగం మరింతగా పెరిగిపోయింది.  దీని కారణంగా, మనకు 4G నెట్వర్కు అందుబాటులో వున్నాకూడా మన ఫోనులో 4G నెట్ స్పీడ్ అందుకోవడం కష్టంగా ఉంటుంది.   

దీనికి ప్రధాన కారణం, 4G LTE కనెక్టివిటీతో కూడిన స్మార్ట్ ఫోన్ల సంఖ్య నానాటికి ఎక్కువగా పెరగడం. ఇంటర్నెట్ స్పీడ్ అనేది పరిమిత పరిధిలో స్పెక్ట్రమ్ ఫలితంగా వస్తుంది. కానీ, మీరు మీ ఫోన్లో 4G వేగం మెరుగుపరచడానికి ఈ పద్ధతులను ఉపయోగించవచ్చు.

1. మొదట మీ ఫోన్ సెట్టింగులకు వెళ్లండి – మొబైల్ నెట్వర్కుల ద్వారా "4G" ను ఎంచుకోండి మరియు దానిని ఎనేబుల్ చేయండి.

2. మీ ఫోనులో యాక్సెస్ పాయింట్ నేమ్ (APN) ను తనిఖీ చేయండి. తగిన APN సమాచారాన్ని ఎంచుకోండి.

3. మీ ఫోన్ సెట్టింగులకు వెళ్లడం ద్వారా మీ APN ను రీసెట్ చేయండి : సెట్టింగులు- మొబైల్ నెట్వర్క్- యాక్సెస్ పాయింట్ పేర్లను క్లిక్ చేసి APN ను డిఫాల్టుకు  రీసెట్ చేయడాన్ని ఎంచుకోండి.

4. మీ ఫోన్ ఉత్తమ యాంటెన్నాలేకపోవచ్చు ఎందుకంటే, అనేక ఫోన్ తయారీదారులు చీప్ లేదా తక్కువ నాణ్యత యాంటెనాలు ఉపయోగిస్తున్నారు.

5. మీ స్మార్ట్ ఫోన్ యొక్క 4G ఇంటర్నెట్ వేగం మీ ఉపయోగంపై ఆధారపడి ఉంటుంది.

6. కొన్ని ఆప్స్ ఇంటర్నెట్ వేగాన్నీ తగ్గిస్తాయి మరియు మరింత డేటాను తీసుకొని ఫోన్ వేగాన్నితగ్గించాయి.

7. మీరు కొంచెం సర్దుబాటు చేయడానికి ఉపయోగించే ఆప్స్ ఆటో ప్లే ఎంపికను నిలిపివేయండి, దీనితో మీ బ్యాండ్విడ్త్ వాడకాన్ని తగ్గిస్తుంది మరియు అవాంఛిత డేటాను తగ్గిస్తుంది.

8. ఇలాచేయడం వలన మీ 4G వేగం 5Mbps నుండి 10Mbps వరకు మారుతుంది

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :