how to download Aadhaar Card on WhatsApp complete guide
ప్రభుత్వం ఆధార్ కార్డు కోసం మరిన్ని సేవలను విస్తరిస్తోంది. ముందుగా ఆన్లైన్ లో ఆధార్ డౌన్‌లోడ్ కోసం పలు అవకాశాలు అందించిన UIDAI ఇప్పుడు ఆధార్ కార్డ్ హోల్డర్లు వారి ఆధార్ కార్డు ను వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా కొత్త సర్వీస్ అందించింది. ఈ కొత్త సర్వీస్ ద్వారా యూజర్లు వారి ఆధార్ కార్డ్ ను వాట్సాప్ నుంచి ఎప్పుడైనా ఈజీగా డౌన్‌లోడ్ చేసుకునే సౌలభ్యాన్ని అందించింది.
Whatsapp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడం చాలా సులభం. దీనికోసం మీరు మీ వాట్సాప్ ను ఉపయోగిస్తే సరిపోతుంది. అయితే, దీనికోసం మీరు మీ ఆధార్ ను DigiLocker తో లింక్ చేసి ఉండాలి. ఇలా ఎందుకు చేయాలంటే, వాట్సాప్ సర్వీస్ లో ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేయడానికి ఇది డిజిలాకర్ సర్వీస్ ను ఉపయోగిస్తుంది.ఎందుకంటే, వాట్సాప్ ద్వారా ఆధార్ ను డిజిలాకర్ సర్వీస్ తో డౌన్లోడ్ చేస్తుంది.
ఇక ఈ ప్రోసిజర్ ఎలా చెయ్యాలో స్టెప్ బై స్టెప్ వివరణ చూద్దాం. ముందుగా మీ వాట్సాప్ చాట్ లోకి వెళ్లి MyGov హెల్ప్ డెస్క్ నెంబర్ +91 9013151515 నెంబర్ ను సేవ్ చేసుకోండి. తర్వాత, ఈ నెంబర్ చాట్ బాక్స్ ఓపెన్ చేసి ‘Hi’ అని మెసేజ్ పెట్టండి. మీరు మెసేజ్ పెట్టగానే సర్వీస్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు DigiLocker ను ఎంచుకోండి. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఈ బాక్స్ లో మీ 12 అంకెల ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి.
మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి OTP అందిస్తుంది. ఈ OTP నెంబర్ ను ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇలా చేయగానే మీ ఆధార్ కార్డు డౌన్లోడ్ అవుతుంది. ఇది చాలా సింపుల్ మరియు సురక్షితంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఆధార్ కార్డు ను ఈ సర్వీస్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Also Read: 15 వేలకే బ్రాండెడ్ 4K QLED Smart Tv ఆఫర్ చేస్తున్న Flipkart BBD Sale
మీ ఆధార్ కి సంబంధించి ఎప్పుడూ రిస్క్ తీసుకోకండి. మీరు ఎల్లప్పుడు ప్రభుత్వ అఫీషియల్ UIDAI లేదా MyGov వంటి ఛానల్స్ ద్వారా మాత్రమే ఆధార్ సర్వీస్ కోసం చూడండి. ఇక్కడ మేము కూడా MyGov యొక్క అఫీషియల్ వాట్సాప్ సర్వీస్ నెంబర్ ను మాత్రమే అందించాము. ముఖ్యంగా, మీరు అందుకునే OTP నెంబర్ ను ఎవరికి షేర్ చేయకండి.