మీ ఫోన్ లో ఇంటర్నెట్ లేకున్నా USSD కోడ్ తో చెల్లింపు చేయండి.. ఎలాగంటే.!

Updated on 04-Nov-2025
HIGHLIGHTS

ఈ ఆధునిక యుగంలో ప్రపంచం మొత్తం కూడా ఇంటర్నెట్ తో నడుస్తోంది

ఇంటర్నెట్ సహాయం లేకుండా కేవలం ఫోన్ తో USSD కోడ్ ఉపయోగించి మీరు చాలా సాఫీగా పేమెంట్ ని చేసే అవకాశం ఉంటుంది

ఇంటర్నెట్ లేని అత్యవసర సమయంలో పేమెంట్ చేయడానికి మీకు సహాయం చేస్తుంది

ఈ ఆధునిక యుగంలో ప్రపంచం మొత్తం కూడా ఇంటర్నెట్ తో నడుస్తోంది. బ్యాంకింగ్ సిస్టం తో పని చేసే ఆన్‌లైన్ పేమెంట్ కోసం కూడా ఇంటర్నెట్ కచ్చితంగా అవసరం అవుతుంది. అంటే, బ్యాంక్ యాప్స్, UPI యాప్స్ మరియు మరిన్ని మాధ్యమాల ద్వారా పేమెంట్ చేయాలంటే మీ ఫోన్ లో ఇంటర్నెట్ పని చేయాల్సి ఉంటుంది. ఒకవేళ సిగ్నల్ లేక మీ ఫోన్ లో ఇంటర్నెట్ లేకపోయినా మరియు మీ ఫోన్ బ్యాలెన్స్ అయిపోయినా ఈ ఫోన్ ఇంటర్నెట్ పని చేయదు. మరి అటువంటి సమయంలో ఎవరికైనా పేమెంట్ చేయాల్సి వస్తే ఎలా, అని మీకెప్పుడైనా డౌట్ వచ్చిందా?. అటువంటి సమయంలో కూడా ఎటువంటి ఇంటర్నెట్ సహాయం లేకుండా కేవలం ఫోన్ తో USSD కోడ్ ఉపయోగించి మీరు చాలా సాఫీగా పేమెంట్ ని చేసే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని గురించి ఈరోజు వివరంగా చర్చిద్దాం.

USSD కోడ్ పేమెంట్ అంటే ఏమిటి?

మొబైల్ ఫోన్ సర్వీస్ ప్రొవైడర్ కంప్యూటర్‌తో కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగించే ఇంటర్నెట్-రహిత ప్రోటోకాల్ ని యుఎస్‌ఎస్‌డి (అన్ స్ట్రక్చర్డ్ సప్లమెంటరీ సర్వీస్ డేటా) అంటారు. ఇది ఫీచర్ ఫోన్ లేదా నెట్‌వర్క్ సరిగ్గా లేని ప్రాంతాల్లో గొప్ప పేమెంట్ ఆప్షన్ గా ఉంటుంది. ఇది SMS సర్వీస్ కాదు మరియు ఇది GSM నెట్ వర్క్ సిగ్నలింగ్ ఛానల్ ని ఉపయోగించి రియల్ టైమ్ లో పని చేసే సెషన్ ఆధారిత కమ్యూనికేషన్. ఈ సిస్టం తో మీరు ఇంటర్నెట్ అవసరం లేకుండా చాలా ఈజీగా పేమెంట్ చేయవచ్చు. ఇది మీ స్మార్ట్ ఫోన్ లో ఇంటర్నెట్ లేని అత్యవసర సమయంలో పేమెంట్ చేయడానికి మీకు సహాయం చేస్తుంది.

Also Read: e Aadhaar App: ఆధార్ కి సంబంధించిన అన్ని అప్డేట్స్ కోసం సింగిల్ యాప్.!

USSD కోడ్ పేమెంట్ ఎలా చేయాలి?

దీనికోసం ముందుగా మీ ఫోన్ తో సింగల్ టైం రిజిస్ట్రేషన్ తో కూడిన సెటప్ అవసరం అవుతుంది. ఈ దీనికోసం మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి యుఎస్‌ఎస్‌డి కోడ్ (ఉదా: *99# ) డయల్ చేయండి. మీ బ్యాంక్ పేరులోని అక్షరాలు మరియు దానికి అనుగుణమైన సంఖ్యను నమోదు చేయండి. తర్వాత మీ కోడ్ కి తగిన మరియు సురక్షితమైన 6 లేదా 4 అంకెల MPIN ని క్రియేట్ చేయండి. ఇలా మీ మొబైల్ నెంబర్ రిజిస్టర్ అవుతుంది.

ఇక పేమెంట్ విషయానికి వస్తే, ముందు వినియోగదారు ప్రత్యేక USSD కోడ్‌ (ఉదా: *99#) ను డయల్ చెయ్యాలి. కోడ్ అందించిన తర్వాత మీకు ఒక మెయిన్ మెనూ వస్తుంది. మీకు వచ్చిన మెయిన్ మెనూ లో డబ్బును పంపించడానికి తగిన నెంబర్ ఎంచుకోండి. ఇక్కడ మీరు డబ్బు పంపాల్సిన వ్యక్తి పేమెంట్ మోడ్ ను ఎంచుకోండి. అంటే, మొబైల్ నంబర్, UPI ID, లేదా IFSC తో కూడిన బ్యాంక్ అకౌంట్ నెంబర్ వంటివి నమోదు చేయండి. పేమెంట్ అమౌంట్ కన్ఫర్మ్ చేసి మీ MPIN అందించి మీ పేమెంట్ ని కన్ఫర్మ్ చేయండి. ఈ వివరాలు అందించిన తర్వాత మీ పేమెంట్ సెండ్ అవుతుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :