how to create action figure style 3d images step by step know here
ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒక కొత్త ఇమేజ్ ట్రెండ్ నడుస్తోంది. అదే Action Figure Style 3D ఫోటో ట్రెండ్. ఈ ట్రెండ్ దెబ్బకు ఈ కొత్త రకం ఇమేజ్ లను ఎలా క్రియేట్ చేయాలి అని ఇంటర్నెట్ లో తెగ వెతికేస్తున్నారు. అందుకే, ఈ కొత్త ట్రెండ్ తో మీరు కూడా మీ ఇమేజ్ లను క్రియేట్ చేసుకోవడానికి వీలుగా స్టెప్ బై స్టెప్ ఈ ఇమేజ్ ఎలా క్రియేట్ చేయాలో వివరాలు అందించాము. ఇక్కడ అందించిన స్టెప్స్ ఫాలో అవుతూ చాలా సింపుల్ గా యాక్షన్ ఫిగర్ స్టైల్ 3D ఫోటోలు జస్ట్ సెకండ్స్ లో క్రియేట్ చేసుకోండి.
గతంలో ప్రపంచాన్ని ఒక ఊపు ఊపిన Ghibli Image గురించి అందరికీ తెలుసు. గిబిలీ ఇమేజ్ ట్రెండ్ విపరీతంగా వైరల్ కావడంతో ప్రతి ఒక్కరు కూడా ఈ ఇమేజ్ లను క్రియేట్ చేసి మరింత వైరల్ చేసేసారు. అయితే, ఇప్పుడు కూడా అదే విధంగా కొత్త యాక్షన్ ఫిగర్ 3D ఫోటో లేదా ఇమేజ్ ట్రెండ్ వైరల్ అవుతోంది. అందుకే, ఈ ఇమేజ్ ఇలా క్రియేట్ చేయాలని ఇంటర్నెట్ లో ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. ఈ కొత్త రకం ఇమేజ్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా మరియు స్టైల్ గా ఉండడమే ఈ ట్రెండ్ వైరల్ అవ్వడానికి కారణం.
దీనికోసం మీరు కొత్త ఎటువంటి యాప్స్ లేదా సబ్ స్క్రిప్షన్ తీసుకోవాల్సిన పని లేదు. జస్ట్ మీ స్మార్ట్ ఫోన్ లో ఉన్న గూగుల్ AI సహాయం తీసుకుంటే సరిపోతుంది. గూగుల్ లేటెస్ట్ గా ప్రకటించిన గూగుల్ జెమినీ ఎఐ ఇమేజ్ క్రియేటర్ జెమినీ Nano Banana ఇమేజ్ క్రియేటర్ పై ఈజీగా క్రియేట్ చేయవచ్చు. అంతేకాదు, ఈ ఫీచర్ Chat GPT పై కూడా అందుబాటులో ఉంది. అయితే, జెమినీ చాలా వేగంగా మరియు చాలా గొప్ప ఇమేజ్ లను క్రియేట్ చేసి అందిస్తున్నట్లు మేమియు గమనించాము.
ఈ ఇమేజ్ క్రియేట్ చేయడానికి మీ ఫోన్ లో ఉన్న Gemini AI ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇమేజ్ యాడ్ చేయడానికి ప్లస్ గుర్తును క్లిక్ చేసి మీరు కోరుకునే ఇమేజ్ ను అప్ లోడ్ చేయండి. తర్వాత ఈ క్రింద అందించిన ప్రాంప్ట్ ను కాపీ చేసి పేస్ట్ చేసి ఇమేజ్ ఇవ్వమని అడగండి. అంతే, మీరు కోరుకున్న ఇమేజ్ యొక్క యాక్షన్ ఫిగర్ స్టైల్ 3D ఇమేజ్ అందిస్తుంది. ఇది కొత్త స్టైల్ ఇమేజ్ లేదా ఫోటో క్రియేట్ చేయడం చాలా సింపుల్ అండ్ ఈజీ అని చెప్పొచ్చు.
అంతా బాగానే ఉంది మీరు పైన చెప్పిన ప్రాంప్ట్ ఎక్కడ? అని మీరు అనుకుంటున్నారా. అక్కడికే వస్తున్నాను. ఈ ప్రాంప్ట్ ఇక్కడ చూడవచ్చు.
Also Read: బడ్జెట్ యూజర్ల కోసం Gemini AI Plus చవక సబ్ స్క్రిప్షన్ ప్లాన్ తెచిన గూగుల్.!
“Create a highly detailed 1/7 scale figurine of the characters from the provided picture, crafted in a realistic style, and displayed in a real-world environment. The figurine is posed dynamically on a round, transparent acrylic base with no text, placed on a sleek, latest model computer desk made of wood with a glossy finish. The desk is organised, featuring a white colour monitor, keyboard, and a few small accessories like a mobile holder and a coffee mug. The computer screen prominently displays the ZBrush modeling process of the figurine, showcasing intricate sculpting details, wireframes, and texture maps in progress. Next to the monitor, a BANDAI-style toy packaging box stands upright, featuring vibrant, two-dimensional flat illustrations of the characters in dynamic poses, with the original artwork faithfully reproduced”.
ఒకవేళ ఈ ఇమేజ్ లో ఇంకా ఏదైనా మార్పులు చేయాలనుకుంటే, ఈ ఇమేజ్ క్రింద సరి చేయాల్సిన వివరాలు అందిస్తే సరిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇమేజ్ లను క్రియేట్ చేసుకోండి.