PDF File ను సులభంగా Word File గా మార్చడానికి స్టెప్ బై స్టెప్ గైడ్

Updated on 23-Jun-2021
HIGHLIGHTS

PDF File ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఉపయోగించబడుతున్న ఫార్మాట్ అని మీకు తెలుసా

గొప్ప విషయం ఏమిటంటే, PDF ఫైల్ ఎటువంటి మార్పు లేకుండా ఎల్లప్పుడూ ఒకేవిధంగా కనిపించడం.

PDF ఫైల్‌లను వర్డ్ ఫైల్‌లుగా సులభంగా మార్చడానికి కొన్ని పద్దతులను ఉపయోగించి చెయ్యవచ్చు

పోర్టబుల్ డాక్యుమెంట్స్ ఫార్మాట్ లేదా PDF File ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఉపయోగించబడుతున్న ఫార్మాట్ అని మీకు తెలుసా. ఒక PDF ఫైల్ గురించి అన్నింటి కంటే గొప్ప విషయం ఏమిటంటే, PDF ఫైల్ ఎటువంటి మార్పు లేకుండా ఎల్లప్పుడూ ఒకేవిధంగా కనిపించడం. మీరు ఎటువంటి ఆపరేటింగ్ సిస్టం లేదా డివైజ్ వాడుతున్నా సరే,  అది ఒకేవిధంగా కనిపిస్తుంది.

అయినప్పటికీ, పిడిఎఫ్ ఫైల్‌లో మార్పులు చేయడం అంత తేలికైన పని కాదు, అందుకే కొన్ని మార్పుల కోసం పిడిఎఫ్ ఫైల్ Word File ఫైల్‌గా మార్చబడుతుంది. వాస్తవానికి ఇది సులభమైన మార్గం కాదు. వాస్తవానికి, మీకు PDF లో లభించే ఫైల్‌ను వర్డ్ ఫైల్‌ గా మార్చడంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు, అయినప్పటికీ మీరు PDF ఫైల్‌లను వర్డ్ ఫైల్‌లుగా సులభంగా మార్చడానికి కొన్ని పద్దతులను ఉపయోగించి చెయ్యవచ్చు, ఇప్పుడు మీరు దీన్ని ఎలా చేయ్యాలో తెలుసుకుందా.

PDF File ‌ను Word File గా మార్చడం ఎలా?

మీరు మీ సిస్టమ్‌లో ఎలాంటి థర్డ్ పార్టీ అనువర్తనాన్ని(యాప్) ఇన్‌స్టాల్ అవరసం లేకుండా చేయ్యాలనుకుంటే, మీరు ఇప్పుడు మీకు చెప్పబోయే పద్ధతి ద్వారా మీరు చేయ్యచ్చు. మీ సిస్టమ్‌లో ఏ యాప్ ఇన్‌స్టాల్ చేయకుండా మీరు ఏ PDF File‌ అయినా Word File గా సులభంగా మార్చవచ్చు. అంతేకాదు, మీరు ఏ పరికరంలో నైనా ఈ పద్ధతిని ఉపయోగించి ఈ పనిని చేయవచ్చు. అంటే, మీరు మీ కంప్యూటర్ లేదా స్మార్ట్ ‌ఫోన్ ‌లో కూడా ఈ పనిని చేయవచ్చు.

మీరు మీ సిస్టమ్‌లోని Search Bar ‌లో PDF అని వ్రాయగానే, మీరు చాలా Tools పొందవచ్చు. కానీ మీరు వాటిలో కొన్ని వివరాలు ఇవ్వాలి. దీనికి, మీరు మీ ఇమెయిల్ ఐడి మొదలైనవి ఇవ్వవలసిన అవసరం లేదు, మీరు ఫైల్‌ను సులభంగా మార్చవచ్చు మరియు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

  • ఇందుకోసం మీరు www.hipdf.com వెబ్‌సైట్‌కు వెళ్లాలి.
  • ఇప్పుడు మీరు ఈ వెబ్‌సైట్‌కు వెళ్ళిన వెంటనే, మీరు ఇక్కడ చాలా ఎంపికలను చూడవచ్చు, కాని మీరు PDF to Word పైన క్లిక్ చేయాలి.
  • దీని తరువాత మీరు మీ సిస్టమ్ నుండి పిడిఎఫ్ ఫైల్ ఎన్నుకోవాలి, ఏదైతే వర్డ్ గా మార్చాలనుకుంటున్నారు దాన్ని మాత్రమే.
  • ఫైల్ ఎంచుకున్న తరువాత మీరు Convert పైన క్లిక్ చేయాలి మరియు ఫైల్ మార్చబడే వరకు వేచి ఉండండి.
  • ఈ ఫైల్ వర్డ్ ఫైల్‌ గా మార్చబడిన వెంటనే, మీరు దీన్ని మీ సిస్టమ్‌లో కూడా సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
  • ఇప్పుడు, మీరు ఈ వర్డ్ ఫైల్‌ను కూడా సవరించవచ్చు మరియు ఆ తర్వాత మీరు దాన్ని మరోసారి PDF గా మార్చవలసి వస్తే కూడా సులభముగా మార్చుకోవచ్చు .
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :