రోజూ మారుతున్న టెక్నలాజితో స్మార్ట్ ఫోన్ ఇబ్బడి ముబ్బడిగా మార్కెట్లోకి లాంచ్ చేయబడుతున్నాయి. మారుతున్న అవసరాలు మరియు ట్రెండ్ ని బట్టి వినియోగదారులు కూడా కొత్త ఫోన్లను ఎంచుకోవడానికి మొగ్గుచూపుతున్నారు. అయితే, కొత్త ఫోన్ ధరలో సగం ధరకే ఒక సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనే వీలుంటుంది కాబట్టి ప్రీమియం ఫోన్లను సగం ధరకే అందుకోవచ్చని కొందరు వినియోగదారుల సెకండ్ హ్యాండ్ ఫోన్లను ఎంచుకుంటారు.
అయితే, కొత్త ఫోన్ అయినా లేదా సెకండ్ హ్యాండ్ ఫోన్ అయినా సరే ఎటువంటి చెకింగ్ చేయకుండా తీసుకున్నారా? మీరు అగచాట్ల పాలవుతారు. మీరు తీసుకున్న ఫోన్ ఒరిజినల్ అవునా లేక కాదా అనే విషయం మీరు నిర్ధారించుకోవడం మంచిది. అందుకే, మీరు ఒక స్మార్ట్ ఫోన్ తీసుకునే ముందుగా ఖచ్చితంగా చెక్ చేసి మాత్రమే తీసుకోవడం నూరుకు నూరు శాతం ఉత్తమం.
డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (DoT) పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన ఫోన్లను ట్రాక్ చెయ్యడానికి సెంట్రల్ ఎక్విప్ మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్(CEIR) ని పోర్టల్ ని లాంచ్ చేసింది. ఈ పోర్టల్ నుండి మీరు కొనదలుచుకున్న ఫోన్ యొక్క వివరాలను చెక్ చెయ్యవచ్చు.
డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (DoT) పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన ఫోన్లను ట్రాక్ చెయ్యడానికి సెంట్రల్ ఎక్విప్ మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్(CEIR) ని పోర్టల్ నుండి మీరు తీసుకోదలుచుకున్న ఫోన్ IMEI నంబర్ తో ఫోన్ ఒరిజినల్ అవునా లేక డూప్లికేట్ లేదా ఇంకేదైనా ఇబ్బంది ఉన్నదా అని ఇక్కడ వెరిఫికేషన్ చెయ్యొచ్చు.