Live Train రన్నింగ్ స్టేటస్ ను గూగుల్ మ్యాప్ లో చూడవచ్చు

Updated on 13-Jun-2022

Google Maps నుండి కేవలం లొకేషన్ లేదా రోడ్ మ్యాప్ లను మాత్రమే చూడవచ్చని అనుకోకండి. గూగుల్ మ్యాప్ రైళ్లు మరియు విమానం వంటి ఇతర ట్రావెల్ మోడ్‌ లను కూడా కలిగి ఉంటుంది. అంతేకాదు, మీ ఉన్న లొకేషన్ నుండి మీరు చేరుకోవాల్సిన గమ్యస్థానానికి రూట్ మ్యాప్‌ తో పాటుగా అందుబాటులో ఉన్న రైలు పేరు, బోర్డింగ్ స్టేషన్ మరియు మార్గంలో వచ్చే ఇతర స్టాప్‌లను కూడా ఈ యాప్ చూపుతుంది. వీటితో పాటుగా ప్రయాణానికి పట్టే సుమారు సమయం మరియు Live Train రన్నింగ్ స్టేటస్ ను కూడా అందిస్తుంది. మరి గూగుల్ మ్యాప్ లో Live Train రన్నింగ్ స్టేటస్ ను ఎలా తెలుసుకోవాలో తెలుసుకుందాం.

పైన తెలిపిన అన్ని వివరాలను మీరు పొందాలంటే ముందుగా మీరు మీ ఫోన్ లో గూగుల్ మ్యాప్ యాప్ యొక్క లేటెస్ట్ వెర్షన్ ను కలిగిఉండాలి. ఈ ఫీచర్ iOS మరియు Android రెండు OS ల కోసం అందుబాటులో వుంది.      

గూగుల్ మ్యాప్ లో Live Train రన్నింగ్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి?

ముందుగా మీ ఫోన్ లో గూగుల్ మ్యాప్ ని తెరవండి

రైల్వే స్టేషన్ లేదా మీరు చేరుకోవాల్సిన డెస్టినేషన్ లొకేషన్ ఎంటర్ చేయండి

మ్యాప్ లో 'టూ-వీలర్' మరియు 'Walk' ఆప్షన్‌ల మధ్య ఉండే 'Train' ఎంపికను ఎంచుకోండి.

మీరు స్టేషన్‌ లకు బదులుగా లొకేషన్ ఉంచినట్లయితే, మ్యాప్ సమయం, దూరం మరియు స్టేషన్‌కు వెళ్లే మార్గాన్ని చూపుతుంది.

ట్రైన్ స్టేటస్ కోసం 'Train' చిహ్నం పైన నొక్కండి

ఇక్కడ కనిపించే ట్రైన్ పేరు పైన నొక్కడం ద్వారా ఆ ట్రైన్ ప్లాట్‌ఫారమ్ నంబర్, ఏ సమయంలో ఆ ప్లాట్‌ఫారమ్‌కు చేరుకుంటుంది వంటి లైవ్ ట్రైన్ వివరాలను చూడవచ్చు.           

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :