how to calculate income tax according to New Tax Regime in online know here
New Tax Regime: ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్, 2024 యూనియన్ బడ్జెట్ ను నిన్న అధికారికంగా ప్రవేశపెట్టారు. కొత్తగా ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్ 2024 లో టాక్స్ పేయర్స్ కోసం కొత్త దిశా నిర్దేశాలు సూచించారు. కొత్తగా ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్ 2024 ప్రకారం టాక్స్ స్లాబ్ లాలో మార్పులు జరిగాయి. ఈ బడ్జెట్ నుండి స్మార్ట్ ఫోన్ యూజర్ల కోసం మాత్రం మంచి శుభవార్త అందించారు. మరి కొత్త బడ్జెట్ అనుసారం ఆన్లైన్ లో టాక్స్ ను ఎలా లెక్కించాలో తెలుసుకుందామా.
కొత్త యూనియన్ బడ్జెట్ 2024 నుంచి కొత్త టాక్స్ స్లాబ్స్ ను ప్రకటించారు. కొత్త టాక్స్ ప్రకారం, సంవత్సరానికి 3 లక్షల లోపు ఆదాయం కలిగిన వారికి ఎటువంటి టాక్స్ వర్తించదు. రెండవ స్లాబ్ విషయానికి వస్తే, 3 లక్షల 1 రూపాయి నుంచి 7 లక్షల వరకు ఆదాయం కలిగిన వారికి 5% టాక్స్ వర్తింప చేసింది. అయితే, గతంలో ఇదే స్లాబ్ 3 లక్షల నుంచి 6 లక్షల వరకు మాత్రమే ఉండేది.
ఇప్పుడు 7 లక్షల వరకు ఆదాయం ఉన్నవారు 5% పరిధి లోకి చేరిపోయారు. అయితే, గత టాక్స్ లెక్కల ప్రకారం 10% టాక్స్ కట్టవలసి వచ్చేది. అలాగే, గతంలో 9 నుండి 10 లక్షల ఆదాయం కలిగిన వారు 15% టాక్స్ చెల్లించాల్సి ఉండగా, ఇప్పుడు అది 10% శాతానికి తగ్గింది. అయితే, ప్రామాణిక తగ్గింపు (స్టాండర్డ్ డిడక్షన్) పన్ పుణ్యమా అని 7 లక్షల వరకు టాక్స్ కట్టే అవసరం లేకుండా తుంది.
Also Read: Poco F6 Limited Edition: పోకో పవర్ ఫుల్ మిడ్ రేంజ్ ఫోన్ స్పెషల్ లిమిటెడ్ ఎడిషన్ వస్తోంది.!
టాక్స్ ను లెక్కించడానికి సింపుల్ విధానం కూడా వుంది. దీనికోసం ఇన్కమ్ టాక్స్ యొక్క అధికారిక వెబ్సైట్ ను దర్శించాలి. ఇక్కడ మీకు కొత్త టాక్స్ ప్రకారం టాక్స్ వివరాలు సింపుల్ గా లెక్కించవచ్చు. దీనికోసం ముందుగా https://www.incometax.gov.in/iec/foportal/ సైట్ ను దర్శించండి.
ఇందులో, మెయిన్ పేజీ లో ఎడమ పక్కన కనిపించే “Quick Links” క్రింద కనిపించే ట్యాబ్ లలో “Income Tax Calculator” ట్యాబ్ ను ఎంచుకోవాలి. ఎంచుకోగానే మీకు టాక్స్ కాలిక్యులేటర్ పెన్ అవుతుంది. ఇందులో కొత్త 2024 – 25 సంవత్సరం ఎంచుకొని మీ ఆదాయ వివరాలు అందించి టాక్స్ వివరాలు పొందవచ్చు.
ఇదే పేజీలో అడ్వాన్స్ టాక్స్ కాలిక్యులేటర్ ఉంటుంది. ఇందులో పాత టాక్స్ రెజిమ్ మరియు కొత్త టాక్స్ రెజిమ్ రెండు వివరాలను క్షుణ్ణంగా తెల్సుకోవచ్చు.