ఆధార్ కార్డ్ లోన్: మీ ఆధార్ కార్డ్ పైన లోన్ పొందవచ్చు..!!

Updated on 22-Jun-2022
HIGHLIGHTS

ధనవంతులైన లేదా పెద్దవారైనా సరే లోన్ కోసం చూస్తుంటారు

మీ ఆధార్‌ కార్డ్ పైన పర్సనల్ లోన్ పొందవచ్చు

లోన్ కోసం ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకోండి

ఎవరికి ఎప్పుడు డబ్బు అవసరం వస్తుందో చెప్పలేని పరిస్థితి. అందుకే, ధనవంతులైన లేదా పెద్దవారైనా సరే లోన్ కోసం చూస్తుంటారు. అంటే, ఒకరకంగా చెప్పాలంటే అప్పు లేదా లోనే లేకుండా జీవితాన్ని సాగించడం అంటే దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి. రుణం అవసరం అవగానే ముందుగా తెలిసిన వారి వద్ద చేబదులు లేదా నమ్మకం పైన కొంత మొత్తాన్ని పొందేవీలుంటుంది. కానీ, ఎక్కవ మొత్తం అవసరమైనప్పుడు బ్యాంక్ ద్వారా లోన్ పొందవచ్చు.

మీ ఆధార్‌ కార్డ్ పైన పర్సనల్ లోన్ కోసం ఎలా అప్లై చేయాలి అనే విషయం గురించి ఈరోజు స్టెప్ బై స్టెప్ వివరంగా చుడనున్నాము. ఇక్కడ ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, మీ ఆధార్ తో పాటుగా రీ పేమెంట్ సోర్స్ మరియు మీ Credit Score ఖచ్చితంగా ప్రధాన పాత్ర పోషిస్తాయి. 

ఆధార్‌ కార్డ్ పైన పర్సనల్ లోన్ ఎలా పొందాలి?

లోన్ కోసం మీరు మీ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ను సందర్శించాలి.

ఇక్కడ బ్యాంక్ వివరాల్లోకి వెళ్ళి పర్సనల్ లోన్‌ పై క్లిక్ చేయండి.

ఇక్కడ మీ మొబైల్ నంబర్‌ ఇవ్వడం ద్వారా OTPని అందుకుంటారు 

మీరు అందుకున్న OTP ని ఎంటర్ చేయండి 

ఇక్కడ అడిగిన మొత్తం సమాచారాన్ని మీ పుట్టిన తేదీ, అడ్రెస్స్ తో సహా నింపండి.

దీని తర్వాత ఇచ్చిన విధంగా పాన్ మరియు ఆధార్ కార్డ్ కాపీని అప్‌లోడ్ చేయండి లేదా సమాచారాన్ని నమోదు చేయండి.

పూర్తి వివరాలు అందించిన తర్వాత, ట్రాకింగ్ నంబర్ మీ స్క్రీన్‌ పై వస్తుంది.

ఇలా పైన తెలిపి విధంగా పూర్తి వివరాలను అందించిన తరువాత బ్యాంక్ మీ అధ్యర్ధనను 48 గంటల లోపల పరిశీలిస్తుంది. ఆధార్ కార్డ్ పైన పర్సనల్ లోన్ అందిస్తున్న వాటిలో SBI , HDFC మరియు Kotak మహీంద్రా బ్యాంక్‌తో సహా అనేక బ్యాంకులు ఉన్నాయి మరియు ఈ బ్యాంక్స్ తమ ఖాతాదారులకు ఆధార్ కార్డు లోన్స్ అందిస్తున్నాయి. అయితే, ఈ బ్యాంకులన్నీ KYC ప్రక్రియ సానుకూలంగా ఉన్న తర్వాత మాత్రమే రుణాలు ఇస్తాయి. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :