రిలయన్స్ జియో యూజర్లు, ఉచిత కాలింగ్ సౌకర్యాన్ని ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లలో ఎలా సెట్ చేసుకోవాలి

Updated on 28-Jul-2020
HIGHLIGHTS

టెలికం సంస్థలు తమ వినియీగదారులకు సరైన ప్రత్యామ్నాయ మార్గాన్ని తీసుకోచ్చాయి.

ఈ సేవ భారతదేశంలోని అన్ని జియో చందాదారుల కోసం ఏదైనా బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌ తో ఉపయోగించవచ్చు.

ప్రస్తుతం టెలికం సంస్థలు తమ ప్లాన్ల ధరను పెంచిన విషయం అందరికీ తెలిసిందే. దీని కారణంగా, వినియోగదారులు తమకు ఇష్టమైన ప్లాన్స్ రీఛార్జ్ చెయ్యటానికి, ఎక్కువ డబ్బును చెల్లించాల్సి వస్తుంది. అయితే, టెలికం సంస్థలు తమ వినియీగదారులకు సరైన ప్రత్యామ్నాయ మార్గాన్ని తీసుకోచ్చాయి. అదే, ఈ VoWiFi కాలింగ్. రిలయన్స్ జియో వినియోగదారులు, ఈ VoWiFi ఫీచరును ఉపయోగించడానికి గాను VoWiFi ని ఆన్ చేసి వైఫై నెట్‌ వర్క్‌ లో కనెక్టయ్యి ఉండాలి. ఈ సేవ భారతదేశంలోని అన్ని జియో చందాదారుల కోసం ఏదైనా బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌ తో ఉపయోగించవచ్చు. 

ఈ VoWiFi కాలింగ్ ఉపయోగించడం కోసం, వినియోగదారులకు దీనికి అనుకూలమైన ఫోన్ మరియు స్థిరమైన Wi-Fi కనెక్షన్ అవసరం. ప్రస్తుతం, ఈ VoWiFi సేవ జియో వినియోగాదారుల కోసం ఒక 150 ఫోన్లలో  పనిచేస్తుంది. ఇందులో, iOS మరియు ఆండ్రాయిడ్ ఫోన్లు వున్నాయి. అయితే, తమ iOS మరియు ఆండ్రాయిడ్ ఫోన్లలో దీనిని ఎలా సెట్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.    

ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉచిత WiFi సెట్టింగ్

ఆండ్రాయిడ్ యూజర్లు మొదట తమ స్మార్ట్‌ ఫోన్ సెట్టింగులకు వెళ్ళాలి.

కనెక్షన్ ఎంపికలు లేదా సిమ్ కార్డ్ మరియు మొబైల్ నెట్‌ వర్క్‌ ను ఇక్కడ సెర్చ్ చేయండి.

మీరు Wi-Fi, Jio లేదా Airtel ని ప్రారంభించాలనుకుంటున్న మీ నంబరును ఎంచుకోండి.

ఇప్పుడు మీరు ఇక్కడ ఇచ్చిన Wi-Fi కాలింగ్ ఫీచర్‌ ను ప్రారంభించాలి. దీని తరువాత, ఫోన్ స్క్రీన్ పైభాగంలో ఉన్న నెట్‌ వర్క్ గుర్తుతో పాటు, VoWiFi యొక్క గుర్తు కూడా కనిపిస్తుంది మరియు ఇక నుండి మీరు Wi-Fi కాలింగ్ చేయగలుగుతారు.

IOS ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉచిత WiFi సెట్టింగ్

iOS వినియోగదారులు మీ పరికరంలోని సెట్టింగ్‌ల ఎంపికకు వెళ్ళాలి.

ఇక్కడ ఇచ్చిన Wi-Fi కాలింగ్ ఫీచర్‌ కు వెళ్లండి.

ఇప్పుడు ఇక్కడ ఈ ఫోన్‌లో వై-ఫై కాలింగ్‌ ను ఆన్ చేయండి. ఈ విధంగా మీరు iOS పరికరాల్లో కూడా Wi-Fi కాలింగ్‌ ను ఉపయోగించగలరు.          

ఈ ఫోన్ల పూర్తి లిస్ట్ ఇక్కడ చూడండి. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :