HMD Global: భారతదేశాన్ని ఎగుమతి కేంద్రంగా చేసుకోవాలని ఆలోచిస్తోంది

Updated on 17-Aug-2020
HIGHLIGHTS

Nokia Brand బ్రాండ్ ‌ను పునరుద్ధరించిన HMD Global, ఇప్పుడు మరొక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతోంది.

ఇక నుండి ఇండియాను ఎగుమతుల కేంద్రంగా మార్చాలని కోరుకుంటోంది.

తక్కువ ఖర్చుతో 4G మరియు 5G స్మార్ట్‌ ఫోన్ ‌లను తయారు చేయడానికి క్వాల్‌ కామ్, గూగుల్ ‌తో పాటు స్థానిక కాంట్రాక్ట్ తయారీదారులను కంపెనీ నియమించనున్నట్లు HMD గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు.

Nokia Brand బ్రాండ్ ‌ను పునరుద్ధరించిన HMD Global, ఇప్పుడు మరొక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతోంది. అదేమిటంటే, ఇక నుండి ఇండియాను ఎగుమతుల కేంద్రంగా మార్చాలని కోరుకుంటోంది. ఈ ఫిన్లాండ్ ఆధారిత సంస్థ ఇటీవల గూగుల్ మరియు క్వాల్కమ్ నుండి 230 మిలియన్ డాలర్ల పెట్టుబడిని పొందింది మరియు ఆ పెట్టుబడిలో కొంత భాగాన్ని భారతదేశంలో తయారీని విస్తరించడానికి ఉపయోగిస్తుందని ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక తెలిపింది.

భవిష్యత్తులో తక్కువ ఖర్చుతో 4G మరియు 5G స్మార్ట్‌ ఫోన్ ‌లను తయారు చేయడానికి క్వాల్‌ కామ్, గూగుల్ ‌తో పాటు స్థానిక కాంట్రాక్ట్ తయారీదారులను కంపెనీ నియమించనున్నట్లు HMD గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. అయితే, దీన్ని చేసిన రెండవ బ్రాండ్ మాత్రమే నోకియా  అవుతుంది. క్వాల్ ‌కామ్ గత నెలలో రిలయన్స్ జియోతో కూడా ఇలాంటి భాగస్వామ్యాన్ని ప్రకటించింది.

HMD Global తన రాబోయే పోర్ట్‌ ఫోలియోను మొదట భారతదేశం కోసం ఉత్పత్తి చేయడానికి, ఆపై ప్రపంచానికి ఎగుమతి చేయడానికి భారత కాంట్రాక్ట్ తయారీదారులతో కలిసి పనిచేయాలని యోచిస్తోంది. ఒకేవేళ, ఇదే కనుక జరిగితే ఇండియాలో తయారీ చేసే నోకియా ఫోన్లు తక్కువ ధరలో లభించడమే కాకుండా, ఇండియా నోకియా ఫోన్ల అంతర్జాతీయ ఎగుమతి కేంద్రంగా మారుతుంది.       

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :