PUBG: న్యూ స్టేట్ ఇండియాలో కూడా వస్తోందా?

Updated on 04-Mar-2021
HIGHLIGHTS

PUBG New State మొబైల్ గేమ్ ఇండీయాలో కూడా ప్రవేశిస్తుందా?

ఇండియాతో సహా పలు దేశాల్లో విడుదల చెయ్యడానికి చూస్తున్నట్లు తెలుస్తోంది.

PUBG మొబైల్ గేమ్ పైన చాలా ప్రతికూల వాతావరణం

కొత్త టైటిల్ తో క్రాఫ్టన్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని చూస్తున్న PUBG New State మొబైల్ గేమ్ ఇండీయాలో కూడా ప్రవేశిస్తుందా? అని చాలా మందికి వచ్చే కామన్ డౌట్. ఎందుకంటే, ఈ బ్యాటిల్ రాయల్ గేమ్ చైనాతో వున్నా లింక్ కారణంగా భారతదేశంలో బహిష్కరణకు గురయ్యింది. అయితే, ప్రస్తుతం ఈ గేమ్ యాజమాన్యం దీన్ని ఇండియాతో సహా పలు దేశాల్లో విడుదల చెయ్యడానికి చూస్తున్నట్లు తెలుస్తోంది.                         

PUBG న్యూ స్టేట్ ఇండియాలో కూడా వస్తుందా?

ప్రస్తుతం వస్తున్నా కథనాల ప్రకారం, Krafton  PUBG న్యూ స్టేట్ మొబైల్ గేమ్ ను ఇండియాలో కూడా లాంచ్ చెయ్యడానికి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇతర దేశాల్లో మాదిరిగా కాకుండా ఇండియా విడిగా లాంచ్ చెయ్యాలని కూడా చూస్తుంది. వాస్తవానికి, ఇప్పటికి ఈ PUBG మొబైల్ గేమ్ పైన చాలా ప్రతికూల వాతావరణం భారతదేశంలో కనిపిస్తోంది. ప్రజల్లో హింసా స్వభావాన్ని  పెంచే విధంగా ఈ గేమ్ ఉన్నట్లు ఇప్పటికే చాలా న్యాయ స్థానాలు కూడా ఉదాహరణగా చూపించాయి .

వాస్తవానికి, ప్రస్తుతప్రతికూల పరిస్థితుల్లో ఈ గేమ్ ను ఇండియాలో లాంచ్ చేయాలనుకోవడం సరైన నిర్ణయం కాకపోవచ్చు. అంతేకాదు, ఈ గేమ్ పైన మరొక బ్యాన్ రాకుండా ఉండడం కోసం కూడా ఆలోచిస్తూ వుండవచ్చు. కానీ, ఈ గేమ్ లో కనిపించని విధంగా హిందీ కోడ్స్ ఉన్నాయనే వార్తలు అనేకమైన అనుమానాలకు తావిస్తుంది. కానీ, Krafton నుండి మాత్రం ఈ విషయం పైన ఎటువంటి అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు.                        

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :