మీ Gmail పాస్ వర్డ్ మర్చిపోయారా… అయితే ఇలా ప్రయత్నించండి..!

Updated on 06-Feb-2022
HIGHLIGHTS

కొంత మంది యూజర్లు తమ జిమెయిల్ పాస్ వర్డ్ మర్చిపోతుంటారు

జిమెయిల్ పాస్ వర్డ్ ను తిరిగి పొందడం గురించి తెలిసివుండాలి

Gmail పాస్ ‌వర్డ్ ‌ను సులభంగా తిరిగి పొందగలుగుతారు

చాలామంది జీవితంలో Gmail ఒక ముఖ్యమైన భాగంగా ఉంటుంది. అయితే, ఒక్కోసారి కొంత మంది యూజర్లు తమ జిమెయిల్ పాస్ వర్డ్ మర్చిపోతుంటారు. మరి అటువంటి సందర్భంలో జిమెయిల్ పాస్ వర్డ్ ను తిరిగి పొందడం గురించి తెలిసివుండాలి. జీమెయిల్  ఆఫీస్ పనులకే కావచ్చు లేదా వ్యక్తిగత జీవితంలోని అవసరాలకు కూడా అన్ని విషయాలకు ఇది ఉపయోగించబడుతుంది. ముఖ్యంగా, Google యొక్క మరే ఇతర సర్వీస్ అయినా  ఉపయోగించలనుకుంటే, మీకు ఇదే Gmail ఖాతా అవసరం అవుతుంది.

కాబట్టి, ఇంత ముఖ్యమైన ఈ Gmail పాస్ ‌వర్డ్ ‌ను మరచిపోవడం సమస్యగా ఉంటుంది. మీరు మీ Gmail పాస్ ‌వర్డ్ ‌ను మరచిపోతే, మీరు దాన్ని క్రింది స్టెప్స్  ద్వారా చాలా సులభంగా తిరిగి పొందగలుగుతారు. దీని గురించి పూర్తిగా స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం …

మీరు మీ Gmail పాస్ ‌వర్డ్ ‌ను మరచిపోతే ఎలా ?

Step 1 – మొదట మీ Google Account లేదా Gmail పేజీని తెరవండి.

Step 2 – ఇప్పుడు గూగుల్ లాగిన్ పేజీలోని 'Forget Password' ఎంపిక పై క్లిక్ చేయండి.

Step 3 – మీకు గుర్తుంకువున్న చివరి పాస్‌ వర్డ్ ‌ను నమోదు చేయండి. మీకు పాస్ ‌వర్డ్ గుర్తులేకపోతే, 'మరో మార్గం ప్రయత్నించండి' (Try another way) ఎంచుకోండి.

Step 4 – మీ Gmail ఖాతాకు లింక్ చేయబడిన ఫోన్ నంబర్ ‌కు గూగుల్ ఒక మెసేజ్ పంపుతుంది.

Step 5 – మీకు ఫోన్ నంబర్ లేకపోతే, Google మీ ఇమెయిల్ ‌కు ఒక వెరిఫికేషన్ కోడ్‌ను పంపుతుంది. మీకు ప్రత్యామ్నాయ ఇమెయిల్ లేకపోతే, 'Try another way' ఎంచుకోండి.

Step 6 – ఇక్కడ మీకు ఇమెయిల్ పంపగల మరొక ఇమెయిల్ ఐడి ని గూగుల్ అడుగుతుంది.

Step 7: ఇప్పుడు మీరు గూగుల్ నుండి ఇమెయిల్ వచ్చినప్పుడు గూగుల్ డైలాగ్ బాక్స్ పేజీని తెరవండి.

Step 8 – మీ పాస్వర్డ్ రికవర్ అయిన తర్వాత, క్రొత్త పాస్ ‌వర్డ్ ఉపయోగించి మీ Gmail కి లాగిన్ అవ్వండి.     

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :