గాలిని శుభ్రం చేసే సీలింగ్ ఫ్యాన్ తెచ్చిన హవెల్స్

Updated on 22-Mar-2021
HIGHLIGHTS

ఈ ఫ్యాన్ పొల్యూషన్ ను క్లిన్ చేస్తుంది.

సూపర్ సీలింగ్ ఫ్యాన్

ఈ టెక్నాలజీతో సీలింగ్ ఫ్యాన్ తీసుకొచ్చిన మొదటి కంపెనీగా హావెల్స్

ప్రముఖ ఇండియా ఫాస్ట్ మూవింగ్ మరియు ఎలక్ట్రికల్ గూడ్స్ సంస్థ Havells ఒక సరికొత్త సీలింగ్ ఫ్యాన్ తీసుకొచ్చింది. గాలిలో వున్న దుమ్ము, ధూళి మరియు పొల్యూషన్ ను క్లిన్ చెయ్యడం ఈ సీలింగ్ ఫ్యాన్ ప్రత్యేకత. సీలింగ్ ఫ్యాన్ ఏమిటి గాలిని శుభ్రం చేయడం ఏమిటి అనుకుంటున్నారా!. అవును హవెల్స్ చల్లని గాల్ని అందిస్తూ అదే గాలిని శుభ్రం చేసేలా అదీకూడా మూడు అంచల ఫిల్టరేషన్ చేసేలా తయారు చేసింది.

Stealth Pure Air పేరుతో హెవెల్స్ తీసుకొచ్చిన సీలింగ్ ఫ్యాన్ PM 2.5 మరియు PM 10 వంటి పోల్యుటెంట్ కణాలను గాలి నుండి తొలిగించి గాలిని శుభ్రం చేస్తుంది. ఇండియాలో ఈ టెక్నాలజీతో సీలింగ్ ఫ్యాన్ తీసుకొచ్చిన మొదటి కంపెనీగా హావెల్స్ నిలిచింది. సెయిలింగ్ నుండి వేలాడుతూ ఇళ్లంతా స్వచ్ఛమైన గాలిని మరింత వేగంగా అందించడమే దీని ప్రత్యేకత.

వినియోగదారులకు ఆరోగ్యవంతమైన గాలిని అందించడమే లక్ష్యంగా ఈ Stealth Pure Air ను తీసుకొచ్చామని, ఈ ఫ్యాన్ లాంచ్ సమయంలో హావెల్స్ తెలిపింది. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ ఫ్యాన్ ను MOP. Rs. 15,000 ధరతో ప్రకటించింది. హావెల్స్ ఎప్పుడు Making a Difference  అనే సిదాంతాన్ని నమ్ముతుంది. అందుకే, ఎవ్వరూ చెయ్యని విధంగా తన ప్రోడక్ట్స్ ని అందిస్తుంది. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :