OTT లో రిలీజ్ అయిన ఈ కొత్త సినిమాలను చూశారా..!!

Updated on 22-May-2022
HIGHLIGHTS

OTT లో రిలీజ్ అయిన ఈ కొత్త సినిమాలను చూశారా

ఈ వారం ఓటీటీ బ్లాక్ బాస్టర్ సినిమాలు రిలీజ్ అయ్యాయి

RRR కూడా ఓటీటీ లో స్ట్రీమ్ అవుతోంది

OTT లో రిలీజ్ అయిన ఈ కొత్త సినిమాలను చూశారా. ఈ వారం ఓటీటీ బ్లాక్ బాస్టర్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో 2022 భారీ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ RRR కూడా వుంది. అంతేకాదు, మెగాస్టార్ చిరంజీవి మరియు మెగా పవర్ స్టార్  రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య ఓటీటీ లో స్ట్రీమ్ అవుతోంది. అంధుకే, సరికొత్తగా ఓటీటీ లో రిలీజ్ అయ్యి స్ట్రీమ్ అవుతున్న ఆ కొత్త సినిమాలు ఏమిటో చూద్దామా.       

RRR

దర్శక ధీరుడు S S రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ మరియు Jr.NTR అద్భుతమైన నటనతో వచ్చిన RRR మూవీ ప్రపంచ వ్యాప్తంగా రికార్డులు కొల్లగొట్టడమే కాకుండా ప్రజల గుండెలో  నిలిచిపోయింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1,000 కోట్లకు పైగా కలక్షన్స్ సాధించి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. RRR మూవీ మే 20 నుండి Zee 5 మరియు Netflix రెండు ప్లాట్ ఫామ్స్ నుండి స్ట్రీమ్ అవుతోంది.

ఆచార్య

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి మరియు రామ్ చరణ్ కలిసి నటించిన 'ఆచార్య' మే 20 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమ్ అవుతోంది. ఇటీవలే  భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయితే, సినిమాలో మెగాస్టార్ మరియు రామ్ చరణ్ ల అద్భుతమైన నటన మరియు డాన్స్ రెండు ఆకట్టుకునే అంశాలు.

భళా తందనానా

శ్రీవిష్ణు మరియు కేథరీన్ జంటగా నటించిన క్రైం థ్రిల్లర్ 'భళా తందనానా' కూడా ఇదే వారం మే 20 నుండి Disney+ HotStar నుండి స్ట్రీమ్ అవుతోంది. ఎప్పుడు ఏదో ఒక విలక్షణమైన కథ మరియు పాత్రలను మాత్రమే చేసే శ్రీవిష్ణు మరొకసారి మంచి సినిమాతో ముందుకు వచ్చాడు. మార్చ్ 6 న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం కూడా అనుకున్న స్థాయిలో విజయాన్ని సాధించేలేక పోయింది. కానీ, శ్రీవిష్ణు యాక్టింగ్, పోసాని మరియు సత్య ల కామెడీ కేథరీన్ గ్లామర్ వంటి ఆకట్టుకునే అంశాలు వున్నాయి.      

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :