Happy Fathers Day 2025: ఫాదర్స్ డే బెస్ట్ విషెస్ మరియు బెస్ట్ విషెస్ ఇమేజెస్.!

Updated on 15-Jun-2025
HIGHLIGHTS

Happy Fathers Day 2025 బెస్ట్ విషెస్ మరియు బెస్ట్ విషెస్ ఇమేజెస్

ఈరోజు ఫాదర్స్ డే శుభాకాంక్షలు చేయడానికి మీకు సహాయం చేయనున్నాము

బెస్ట్ విషెస్ మరియు బెస్ట్ విషెస్ ఇమేజ్ లను మీకోసం అందిస్తున్నాం

Happy Fathers Day 2025 : ఈ ప్రపంచంలో ఎంత మంది మన తోడుగా ఉన్న నాన్న ఇచ్చే నమ్మకానికి సాటి ఎవరూ లేరు. నాన్న అంటే నమ్మకం, నాన్న అంటే త్యాగం, నాన్న అంటే కనిపించే దేవుడు. నాన్నను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే బహుశా ఈ జన్మ సరిపోదు. అటువంటి మహోన్నతమైన వ్యక్తి నాన్న గారికి ఈరోజు ఫాదర్స్ డే శుభాకాంక్షలు చేయడానికి మేము సహాయం చేయనున్నాము. మీ నాన్నగారికి షేర్ చేయదగిన బెస్ట్ విషెస్ మరియు బెస్ట్ విషెస్ ఇమేజ్ లను మీకోసం అందిస్తున్నాం.

Happy Fathers Day 2025: విషెస్

నా జీవితానికి దొరికిన గొప్ప వరం నువ్వే నాన్న, హ్యాపీ ఫాదర్స్ డే నాన్న!

నీ త్యాగమే నేను ఈరోజు అనుభవిస్తున్న జీవితం, ఏమిచ్చి నీ రుణం తీర్చుకో గలను నాన్న, హ్యాపీ ఫాదర్స్ డే నాన్న!

ఈరోజు ఫాదర్స్ అని విషెస్ చెబుతున్నానే గాని, నా గుండెల్లో నిత్యం స్మరించేది నిన్నే నాన్న, హ్యాపీ ఫాదర్స్ డే!

నా సంతోషం కోసం నీ సంతోషాన్ని త్యాగం చేశావా నాన్న, ఎందుకు నాన్న నేనంటే నీకు అంత ప్రేమ, ఎన్ని జన్మలైనా నీ కొడుకు గానే పుట్టాలి, హ్యాపీ ఫాదర్స్ డే నాన్న!

నా హీరో మీరే నాన్న, ఈ జీవితం మీరిచ్చిన వారం నాన్న, మీకు హ్యాపీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు!

హ్యాపీ ఫాదర్స్ డే 2025, ఆ దేవుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్ధిస్తున్నాను!

మీరు ఎప్పుడూ నవ్వుతూ అందరినీ నవ్విస్తూ మీ జీవితం సంతోషంగా గడపాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. మీకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు నాన్న!

మీరు చూపిన ప్రేమ, కృషి నన్ను ఇంతవాడిని చేసింది నాన్నా, హ్యాపీ ఫాదర్స్ డే నాన్న!

ప్రేమ, కృషి, ఓర్పు మరియు పట్టుదల అన్నింటిలో మీరే మాకు ఆదర్శం నాన్నా, హ్యాపీ ఫాదర్స్ డే!

నాన్న అంటేనే ధైర్యం, నమ్మకం, ప్రేమ, ఆశీర్వాదం. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న!

Also Read: Talliki Vandanam: తల్లికి వందనం డబ్బులు పడలేదా, స్టేటస్ ఇలా చెక్ చేయండి.!

Happy Fathers Day 2025: బెస్ట్ విషెస్ ఇమేజస్

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :