Crypto Currency భవిష్యత్తు గురించి చర్చించడానికి ప్రభుత్వం వాటాదారులను కలవనుంది

Updated on 12-Nov-2021
HIGHLIGHTS

Crypto Currency భవిష్యత్తు గురించి చర్చించడానికి ప్రభుత్వం వాటాదారులను కలవనుంది

క్రిప్టోకరెన్సీ పైన తన వైఖరిని మార్చులున్న ప్రభుత్వం

ప్రభుత్వం తన వంతు కృషి చేస్తోంది

భారత ప్రభుత్వం Crypto Currency భవిష్యత్తు గురించి చర్చించడానికి ప్రభుత్వం వాటాదారులను కలవనుంది. ప్రభుత్వం క్రిప్టోకరెన్సీ పైన తన వైఖరిని కొంత మార్చుకొని CoinSwitch Kuber, CoinDCX, WazirX మరియు Crypto అసెట్స్ కౌన్సిల్ (BACC)తో సహా దేశంలోని ప్రధాన మరియు అగ్ర క్రిప్టో ఎక్స్ చేంజెస్ మరియు వాటాదారులతో కూడా చర్చలు జరపాలని యోచిస్తోంది.

కొన్ని నివేదికల ప్రకారం, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ఫైనాన్స్ ఈ నెల 15వ తేదికి వాటాదారులతో భేటీ అవుతుంది మరియు అక్కడ  భారతదేశంలో Crypto Currency భవిష్యత్తు గురించి చర్చలు జరిపే అవకాశం వుంది.

ఈ భేటీలో ఎటువంటి విషయాలను గురించి చర్చించుకుంటారో అని కూడా కొన్ని నివేదికలు వెల్లడించాయి. ఈ నివేదిక ప్రకారం, క్రిప్టోకరెన్సీలు భారతీయ కరెన్సీ మరియు మొత్తం ఆర్థిక వ్యవస్థపై చూపే ప్రభావం గురించి ప్రధానంగా చర్చించవచ్చు. వాస్తవానికి, ప్రభుత్వ ప్రతినిధులు క్రిప్టో వాటాదారులతో కలిసి కూర్చోవడం ఇదే మొదటిసారి కాదు. క్రిప్టోకరెన్సీల భవిష్యత్తుకు స్థిరమైన పరిష్కారాన్ని గుర్తించేందుకు ప్రభుత్వం తన వంతు కృషి చేస్తోంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :