ఖచ్చితమైన సామాజిక దూరం కోసం Google నుండి కొత్త టూల్

Updated on 01-Jun-2020
HIGHLIGHTS

ప్రజలకు సహాయపడే కొత్త సాధనాన్ని(Tool)ని Google విడుదల చేసింది

ఈ టూల్ ప్రస్తుతం Android వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది

ఇది మీకు ఖచ్చితమైన సామాజిక దూరాన్ని సూచించడానికి ఉపయోగపడుతుంది.

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ యొక్క వ్యాప్తిని అరికట్టడానికి అందరూ అవలంభించాల్సిన సోషల్ డిస్టెన్స్ ని సరిగా పాటించేలా సహాయపడటానికి ప్రజలకు సహాయపడే కొత్త సాధనాన్ని(Tool)ని Google విడుదల చేసింది, అదే SODAR. అయితే, ఈ టూల్  ప్రస్తుతం Android వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది మరియు ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) ద్వారా వినియోగదారుని చుట్టూ తెల్లటి వృత్తాన్ని కనిపించేలా చేయడానికి ఫోన్ కెమెరాను ఉపయోగిస్తుంది. ఈ సర్కిల్ వినియోగదారు చుట్టూ 2 మీటర్ల వ్యాసార్థం కలిగి ఉంది. "ఈ ప్రయోగం మీరు 2 మీటర్ల ఖచ్చితమైన సామాజిక-దూరాన్ని పాటించేలా చేయటానికి  వెబ్‌ఎక్స్ఆర్‌ను ఉపయోగిస్తుంది" అని ఈ వెబ్‌సైట్ పేర్కొంది.

SODAR ఎలా ఉపయోగించాలి

ఈ టూల్ ని ఉపయోగించడానికి, వినియోగదారులు Google Chrome బ్రౌజర్‌ను ఉపయోగిస్తున్నప్పుడు వారి Android ఫోన్ల నుండి https://sodar.withgoogle.com/ కు వెళ్లాలి. ఇక్కడ మీరు కొన్ని అవసరమైన పర్మిషన్లకు అనుమతించాలి మరియు టూల్ దాని ఉపయోగాన్ని నేరుగా పొందడానికి కెమెరాను నేల వైపుకు చూపిస్తుండాలి.  ఇది పూర్తయిన తర్వాత, ఈ టూల్ మీ చుట్టూ 2 మీటర్ల  సర్కిల్‌ను ప్రొజెక్ట్ చేస్తుంది, ఇది మీకు ఖచ్చితమైన సామాజిక దూరాన్ని సూచించడానికి ఉపయోగపడుతుంది.

కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం ఒక సిస్టంను  రూపొందించడానికి గూగుల్ ఆపిల్‌తో కలిసి పనిచేస్తోంది. API ఇప్పుడు అందుబాటులో ఉంది మరియు స్విస్ కోవిడ్ అని పిలువబడే సొంత కాంటాక్ట్ ట్రేసింగ్ యాప్ రూపొందించడానికి స్విట్జర్లాండ్ దీనిని ఉపయోగించిన మొదటి దేశంగా నిలుస్తుంది. ఈ యాప్ ప్రస్తుతం పైలట్ పరీక్షలో ఉంది మరియు EPFL ఉద్యోగులు, ETH జూరిచ్, ఆర్మీ మరియు కొన్ని ఆసుపత్రులు మరియు ప్రభుత్వ సంస్థలు ఉపయోగిస్తాయి. గూగుల్ మరియు ఆపిల్ API కి జతచేసిన ప్రైవసీ లక్షణాల కారణంగా, స్విస్‌కోవిడ్ యాప్ వినియోగదారుల లొకేషన్లను ట్రాక్ చేయదు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :