ఇండియాలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలా బడ్జెట్ స్మార్ట్ ఫోన్లను అందించడానికి రిలయన్స్ జియో తో కలిసి పనిచేస్తున్నామని Google CEO సుందర్ పిచ్చాయ్ ఒక ప్రకటనలో తెలిపారు. భారత దేశంలో 4G నెట్ వర్క్ వచ్చిన చాలా కాలం అవుతున్నా ఇప్పటికి 2G ఫోన్లను వాడుతున్న వారి సంఖ్య ఎక్కువగానే వుంది. కాబట్టి, చవక ధరలో స్మార్ట్ ఫోన్లను తీసుకురావడం ద్వారా ప్రతి ఒకరికి 4G స్మార్ట్ ఫోన్ ను అందించ గలిగే వీలుంటుంది.
ముందుగా, గత సంవత్సరం Google సంస్థ 33 వేల కోట్లతో 7.7 శాతం జియో వాటిని చేజిక్కుంచుకుంది. అయితే, కొత్తగా వచ్చిన ఈ న్యూస్ మాత్రం వర్చువల్ కాన్ఫరెన్స్ లో జరిగినట్లు తెలుస్తోంది. Google మరియు Jio ఉమ్మడిగా అతి చవక ధరకే స్మార్ట్ ఫోన్ టెక్నాలజీని భారతీయలకు అందిచే ప్రయత్నాలు చేస్తున్నాయని మనం అర్ధం చేసుకోవచ్చు.
దీన్ని బట్టి చూస్తుంటే, అతి త్వరలోనే ఇండియాలో గూగుల్ మరియు జియో జతగా సరసమైన ధరలో స్మార్ట్ ఫోన్లను ప్రకటించవచ్చని ఊహిస్తున్నారు. అంతేకాదు, ఇప్పటికే తక్కువ ధరలో ఎక్కువ లాభాలనిచ్చే ప్లాన్స్ అందిస్తున్న జియో మరిన్ని ప్లాన్స్ కూడా అందించవచ్చని కూడా అంచనా వేస్తున్నారు.