ఇక Google సెర్చ్ మరియు మ్యాప్ లో వర్చువల్ హెల్త్ కేర్ అప్షన్ మరింత స్పష్టంగా

Updated on 13-Apr-2020
HIGHLIGHTS

గూగుల్ సెర్చ్ మరియు గూగుల్ మ్యాప్స్‌ లో వర్చువల్ హెల్త్ కేర్ ఎంపికలను మరింత స్పష్టంగా కనిపించేలా మార్చాలని గూగుల్ నిర్ణయించింది.

మీరు Google Search లో వర్చువల్ హెల్త్‌కేర్ కోసం మరిన్ని అప్షన్లను కలిగి ఉంటే, అది పూర్తిగా ఉద్దేశపూర్వకంగా. కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి విధించిన లాక్ డౌన్ సమయంలో వైద్యులను సందర్శించకుండానే  ఆరోగ్య సంరక్షణను మెరుగుపరిచే ప్రయత్నంలో భాగంగా, గూగుల్ సెర్చ్ మరియు గూగుల్ మ్యాప్స్‌ లో వర్చువల్ హెల్త్ కేర్ ఎంపికలను మరింత స్పష్టంగా కనిపించేలా మార్చాలని గూగుల్ నిర్ణయించింది.

దేశంలోని చాలా ఆసుపత్రులు ఇతర వ్యాధుల చికిత్సను నిలిపివేసి COVID-19 కేసులపై దృష్టి సారించాల్సి ఉండగా, సామాన్య ప్రజలు తాము కూడా ఈ వైరస్ భారిన పడతారేమోననే  భయంతో ఆసుపత్రులను సందర్శించడం మానేశారు. అటువంటి పరిస్థితిలో, ఫోన్ ద్వారా లేదా ఇంటర్నెట్ ద్వారా డాక్టర్ ని సంప్రదించడం మంచిదని గూగుల్ అభిప్రాయపడింది. ఇది ఆసుపత్రులు మరియు ఆరోగ్య సంరక్షణ కార్మికులపై భారాన్ని తగ్గించడంలో మరింతగా సహాయపడుతుంది మరియు వైద్య సహాయంకోసం బయట తిరిగేవారిని  తగ్గించడానికి ఇది సహాయపడుతుంది.

ఈ ఫీచర్ ఫలితంగా, గూగుల్ సెర్చ్ మరియు గూగుల్ మ్యాప్స్‌లో మీ సమీపంలోని హెల్త్ కేర్ సెంటర్ లేదా క్లినిక్‌ ను గుర్తించే మరియు కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఎంపికలను మీరు ఇప్పుడు చూస్తారు.

ఆసుపత్రులు, మానసిక ఆరోగ్య నిపుణులు మరియు రోగులకు వర్చువల్ గా చికిత్స చేయాలనుకునే వైద్యులు వారి ప్రొఫైల్‌లో ‘వర్చువల్ కేర్ ఆఫరింగ్’ ను ఎంచుకోవచ్చు. తరువాత , వర్చువల్ హెల్త్ కేర్ ప్రొవైడర్ కోసం వెతుకుతున్న వారికీ, వారి  Search మరియు మ్యాప్స్‌ లో ‘ఆన్‌లైన్ కేర్ పొందండి’ ఎంపికను చూస్తారు.

ఈ ఫీచర్ మొదటగా యునైటెడ్ స్టేట్స్ లో  పైలట్ అవుతుంది, అటుతరువాత ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :